Ram Charan: జై హనుమాన్‌లో రామ్ చరణ్

హనుమాన్ మూవీలో తేజా సజ్జా హనుమంతుడి రోల్ లో నటించగా, రాబోతున్న సీక్వెల్‌లో ఆంజనేయుడు ఉంటాడని తెలుస్తుంది. ఇక జై హనుమాన్‌కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ సెకండ్ పార్ట్ జై హనుమాన్‌లో తేజా సజ్జ ఉండడని అన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 23, 2024 | 01:53 PMLast Updated on: Jan 23, 2024 | 1:53 PM

Ram Charan Will Be Hanuman In Prasanth Varmas Jai Hanuman Movie

Ram Charan: సంక్రాంతి పండగ వేళ నాలుగు సినిమాలు విడుదలైనా చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ అదరగొట్టింది. తేజ సజ్జా హీరోగా వచ్చిన ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ సీక్వెల్ విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. హనుమాన్ మూవీలో తేజా సజ్జా హనుమంతుడి రోల్ లో నటించగా, రాబోతున్న సీక్వెల్‌లో ఆంజనేయుడు ఉంటాడని తెలుస్తుంది.

Mahesh Babu: మ‌హేశ్ ఇక లాక్ అయిపోయినట్లేనా..? డేట్ ఫిక్స్‌..

ఇక జై హనుమాన్‌కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ సెకండ్ పార్ట్ జై హనుమాన్‌లో తేజా సజ్జ ఉండడని అన్నారు. అంతేకాదు జై హనుమాన్‌లో స్టార్ హీరో నటిస్తారని చెప్పారు. సినిమా ముగింపులో కూడా, రెండవ భాగంలో హనుమంతుడు స్వయంగా చెడుతో పోరాడతాడని అతను స్పష్టంగా చూపించాడు. హనుమాన్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో జై హనుమాన్‌పై సూపర్ క్రేజ్ ఏర్పడింది. అయితే ప్రశాంత్ వర్మ చెప్పిన ఆ స్టార్ హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది. జై హనుమాన్ సినిమాలో ఆంజనేయుడిగా నటించే ఆ స్టార్ హీరో ఎవరన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే కొందరు రామ్ చరణ్.. ఆంజనేయుడిగా నటిస్తాడని అంటుండగా మరికొందరు, అర్జున్ సర్జా హనుమంతుడిగా చేస్తాడని అంటున్నారు.

జై హనుమాన్ సినిమా 2025లో రిలీజ్ చేస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. అంతేకాదు ఈ సినిమాతో పాటుగా ఈ ఇయర్ అధీర, మహాకాళీ అనే రెండు సినిమాలు రిలీజ్ చేస్తామని అన్నారు. ప్రశాంత్ వర్మ అనౌన్స్‌మెంట్‌తో హనుమాన్ ఫ్యాన్స్ అంతా సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు.