ప్రభాస్ కంటే కూడా… ఎన్టీఆరే ఎక్కువ భయపెడుతున్నాడు…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లండన్ లో లాంగ్ హాలీడే తో రిలాక్స్ అంటున్నాడు. ఎగ్జాక్ట్ గా ఇదే టైం కి సూపర్ స్టార్ మహేశ్ బాబు జెర్మనీలో ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ కి రెడీ అయ్యాడు. మరి రెబల్ స్టార్ పరిస్థితేంటి?... నిజానికి తను కూడా ఎబ్రాడ్ వెల్లేందుకు రెడీ అవుతున్నాడు.
2024 ఇయర్ మొత్తం బాలీవుడ్, కోలివుడ్, శాండిల్ వుడ్ అంతా టాలీవుడ్ ని చూసి వణికారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పాన్ ఇండియా హిట్లు ఇక్కడ నుంచే వచ్చాయి. 1200 కోట్లు, 1700 కోట్లు, 670 కోట్లు ఇలా వసూళ్ల సునామీలను క్రియేట్ చేశాయి, దేవర, కల్కీ, పుష్ప2 మూవీలు. కాకపోతే 2025 కి కూడా ఇదే రేంజ్ లో వసూళ్ల రీసౌండ్ ఉంటుందా? ఆ ప్రశ్నకు సమాధానం రామ్ చరణ్ చేతుల్లో ఉంది. విచిత్రం ఏంటంటే అందరికంటే ఆ ప్రశ్న చరణ్ నే ఎక్కువ కంగారు పెడుతోంది. 2023, 2024 లో వరుసగా పాన్ ఇండియా హిట్లతో రెబల్ స్టార్ అందరినీ భయపెడుతూ వచ్చాడు. మెగా హీరోలతో టర్మ్స్ బాలేకున్న అల్లు అర్జున్ కి పుష్ప2 కలిసి రావటంతో, ఇప్పుడు గ్లోబల్ స్టార్ పరిస్థితేంటనే ప్రశ్న ఎదురౌతోంది. విచిత్రం ఏంటంటే పుష్ప2 రిజల్ట్ కంటే, కల్కీ మూవీ వసూళ్ల కంటే కూడా దేవర రిజల్టే రామ్ చరణ్ ని ఎక్కువ కంగారుపెడుతోంది. బాక్సాఫీస్ లో భారీ అగ్నీ పరీక్షకు దేవర సౌండే కారణమౌతోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర హిట్టై, ఓటీటీని షేక్ చేసి, నెలలు, వారాలు గడుస్తోంది.. కాని ఇప్పుటికీ దేవర రిజల్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని కంగారుపెడుతోంది. ఇదొక్కటే కాదు ఈఏడాది దుమ్ముదులిపిన ప్రతీ పాన్ ఇండియా హిట్ రామ్ చరణ్ ని భయపెడుతున్నాయి. కారణం 2024 ని హానుమాన్ లాంటి హిట్ తో యంగ్ హీరో తేజా సజ్జా షురూ చేస్తే, కల్కీ హిట్ తో పాన్ ఇండియాని షేక్ చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్
1200 కోట్ల వసూల్లలో కల్కీ దుమ్ముదులిపింది. అంతెందుకు సలార్ కూడా 2023 ఎండ్ కి రావటం వల్ల ఆ ఇయర్ ఎకౌంట్ లో పడింది కాని, లేదంటే అది కూడా 2024 ని పాన్ఇండియా హిట్ తో మొదలుపెట్టిన మూవీగానే ఫోకస్ అయ్యుండాలి…
ఏదేమైనా రెండు పాన్ ఇండియా హిట్లతో దూసుకెళ్ళి 2000 కోట్ల వసూళ్లకి కారణమైన రెబల్ స్టార్ కంటే కూడా దేవర మూవీనే రామ్ చరణ్ ని బాగా కలవర పెడుతోంది. కారణం తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు కాబట్టే, చరణ్ కి గ్లోబల్ స్టార్ రిజల్ట్ అగ్నిపరీక్ష అయ్యింది. తోటి హీరోలంతా పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ నికుమ్మిపడేస్తే, ఇప్పుడు తన నెంబర్ వచ్చింది
ఖచ్చితంగా పాన్ ఇండియా హీరోలతోనే, కాదు పాన్ ఇండియా హిట్లతో కూడా పోలిక వస్తుంది. సలార్, కల్కీ, హనుమాన్, పుష్ప2, దేవర ఇన్ని పాన్ ఇండియా హిట్లుంటే, ఇందులో దేవరనే ఎక్కుడ చరణ్ కి అగ్నిపరిక్షగా మారింది.
ఎందుకంటే త్రిబుల్ ఆర్ లో కలిసి నటించటమే కాదు, రాజమౌళి సెంటిమెంట్ ని ఫస్ట్ బ్రేక్ చేసింది కూడా తారకే. ఇప్పుడు మరి అదే సెంటిమెంట్ ని చరణ్ బ్రేక్ చేస్తాడా? అదే సెంటిమెంట్ కి బలౌతాడా? ఈ డౌట్లే తనకి కొండంత ప్రెషర్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఒకవైపు ఫ్లాపుల శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ అవటంతో, గేమ్ ఛేంజర్ మీద పెద్దగా అంచనాలు లేవు.పాటలు పేలకపోవటం, టీజర్ సోసోగా ఉండటంతో అస్సలు హైప్ రావట్లేదు.
కాని గేమ్ ఛేంజర్ హిట్ కాకపోతే గ్లోబల్ స్టార్ గా తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజమౌళి లేకపోతే మెగా పవర్ స్టార్ గానే మిగిలిపోతాడా అన్న కామెంట్లకు బలవ్వాల్సి వస్తుంది. దీనికి తోడు 2025 ని పాన్ ఇండియా హిట్ తో షురూ చేయాల్సిన బాద్యత తన మీదుంది… సో రెండు రకాలుగా తనకిది అగ్నిపరీక్షలా మారింది