RAM CHARAN: 1000 మందితో రామ్ చరణ్ ఫైట్.. మైండ్‌బ్లోయింగ్ సీక్వెన్స్..
వెయ్యి మంది ఫైటర్స్‌తో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫైట్ సీన్ డిజైన్ చేశాడు. ఆమధ్య ఈ సీన్ తెరకెక్కినట్టు కూడా వార్తలొచ్చాయి. అదో హాట్ టాపిక్ అయ్యింది కూడా. కాకపోతే గేమ్ ఛేంజర్‌లో ప్రీక్లైమాక్స్‌లో వచ్చే ఈ సీన్‌కు సంబంధించిన పెండింగ్ షూటింగ్ వచ్చే షెడ్యూల్‌లో పూర్తి చేయబోతున్నారట.
RAM CHARAN: త్రిబుల్ ఆర్‌లో దాదాపు రెండు వేల మందితో హీరో రామ్ చరణ్ ఫైట్ చేస్తే.. ఆ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎంత సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మామూలుగా అయితే వేల మందితో ఒక్కడి ఫైట్ అంటే ట్రోలింగ్ జరగాలి. కాని చాలా సెన్సిబుల్‌గా 30 రోజులు కష్టపడి, రెండువేల మందితో ఈ ఫైట్ సీన్ తీశాడు రాజమౌళి. అలాంటి సెన్సేషన్ సీన్ రాజమౌళి తీశాక, మరో లివింగ్ లెజెండ్ శంకర్ ఊరుకుంటాడా..?
The Raja Saab: ది రాజాసాబ్‌లో వింటేజ్ ప్రభాస్.. ఆ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్న మారుతి..!
అంతకుమించే సీన్‌ని డిజైన్ చేశాడు. వెయ్యి మంది ఫైటర్స్‌తో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫైట్ సీన్ డిజైన్ చేశాడు. ఆమధ్య ఈ సీన్ తెరకెక్కినట్టు కూడా వార్తలొచ్చాయి. అదో హాట్ టాపిక్ అయ్యింది కూడా. కాకపోతే గేమ్ ఛేంజర్‌లో ప్రీక్లైమాక్స్‌లో వచ్చే ఈ సీన్‌కు సంబంధించిన పెండింగ్ షూటింగ్ వచ్చే షెడ్యూల్‌లో పూర్తి చేయబోతున్నారట. గ్రాఫిక్స్ ప్రకారం కొన్ని ప్యాచ్ వర్క్ ఉండటంతో, ఆసీన్‌కు సంబంధించిన కొన్ని షాట్స్ కోసం లాస్ట్ షెడ్యూల్‌లోఆ సీన్‌ని మళ్లీ తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.
ఈ సారి హీరో లేకుండా, హీరో డూప్‌తోనే ఈ సీన్ తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. గ్లోబల్ స్టార్‌గా త్రిబుల్ ఆర్‌తో వచ్చిన పేరు, అందులో హైలెట్ అయిన వేల మంది ఫైటర్లతో రామ్ చరణ్ ఫైట్ సీన్ చూశాక, ఇక ఆర్డినరీ యాక్షన్ సీన్ తీస్తే సరిపోదు. అందుకే గేమ్ ఛేంజర్‌లో ఇలాంటి భారీ సీన్‌ని అంతకు మించేలా తీస్తున్నాడు లివింగ్ లెజెండ్ శంకర్.