Ram Charan: గేమ్ ఛేంజర్ మూవీ నుంచి శంకర్ ఔట్.. గొడవ ఏంటి.?
గేమ్ ఛేంజర్ మూవీ 95 శాతం షూటింగ్ అయిపోయింది. కేవలం ప్యాచ్ వర్క్ తాలూకు లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి టైంలో డైరెక్టర్ శంకర్ హ్యాండ్ ఇచ్చాడట.

Ram Charan's film Game Changer directed by Shankar is in the final stages of shooting
మంగళవారం నుంచే గేమ్ ఛేంజర్ షూటింగ్ తాలూకు లాస్ట్ షెడ్యూల్ షురూ అయ్యింది. ఐతే ఈ షెడ్యూల్ షూటింగ్ కి శంకర్ రాలేదు. హిట్ మూవీల తర్శకుడు శౌైలేష్ కొలను ఈ పెండింగ్ ప్యాచ్ వర్క్ షూటింగ్ పూర్తి చేస్తున్నాడట.
హీరో లేని సీన్లను శైలేష్ కొలను తీస్తుంటే, హీరో తాలూకు సీన్లను వంశీ పైడి పల్లి తెరకెక్కించబోతున్నాడట. 20రోజుల ఈ ఆఖరి షెడ్యూల్ కి శంకర్ రాకపోవటానికి కారణం, దిల్ రాజుతో బడ్జెట్ విషయంలో వెభేదించటం అని ఒకరు, కాదు భారతీయుడు 2 పెండింగ్ షూటింగ్ వల్లే చెర్రీ సినిమా ప్యాచ్ వర్క్ ని శంకర్ లైట్ తీసుకున్నాడని మరొకరు, ఇలా చర్చ పెరిగింది. ఏదేమైనా ప్యాచ్ వర్క్ పెద్ద విషయం కాకపోయినా, శంకర్ లాంటి డైరెకట్ర్ ఆఖరి నిమిషంలో ఇలా హ్యాండ్ ఇవ్వటం తో ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పరిస్తితి వస్తోంది.