Ram charan: రామ్ చరణ్‌కు పుష్ప 2 దెబ్బ.. గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు..?
పుష్ప 2 ఏప్రిల్లో రిలీజ్ చేస్తారని ప్రచారం నడిచింది. దీనికి తగ్గట్టే.. షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. అయితే వున్నట్టుండి, ఎలాంటి హడావుడి లేకుండా 2024 ఆగస్ట్ 15న రిలీజ్ అంటూ విడుదల తేదీ ప్రకటించడంతో రామ్ చరణ్ టీం ఖంగుతింది.

Ram charan: పుష్ప 2 రిలీజ్ డేట్‌ను సడెన్‌గా ఎనౌన్స్ చేయడంతో చాలామంది షాక్ అయ్యారు. అయితే అందరికంటే ఎక్కువగా షాక్ అయింది రామ్ చరణే. పుష్ప 2 రిలీజ్ డేట్‌తో రామ్‌చరణ్‌కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? దీని వెనుక పెద్ద కథే నడిచింది. పుష్ప 2 ఏప్రిల్లో రిలీజ్ చేస్తారని ప్రచారం నడిచింది. దీనికి తగ్గట్టే.. షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. అయితే వున్నట్టుండి, ఎలాంటి హడావుడి లేకుండా 2024 ఆగస్ట్ 15న రిలీజ్ అంటూ విడుదల తేదీ ప్రకటించడంతో రామ్ చరణ్ టీం ఖంగుతింది.
ఎందుకంటే ఇదే డేట్‌కు రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ను రిలీజ్ చేయాలన్న ప్లాన్‌లో శంకర్ వున్నాడు. 2023, 2024 సంక్రాంతిని మిస్ చేసుకున్న గేమ్ ఛేంజర్ మూవీ 2024 ఆగష‌్టుకు వెళ్లిపోయిందంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పుష్ప 2 మూవీ సమ్మర్‌కు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో ఆ టీంకు ఉన్న మరో ఆప్షన్ ఆగస్ట్ 15. దీంతో గేమ్ ఛేంజర్ టీం కంటే ముందే పుష్ప 2 రిలీజ్ డేట్ ప్రకటించారు. దీంతో శంకర్ టీం ఏం చేయలేని పరిస్థితిలో వుండిపోయింది. ఈ పరిస్థితుల్లో పుష్ప 2కు గేమ్ ఛేంజర్ నుంచి కాంపిటీషన్ లేకపోయినా బాలీవుడ్ మూవీ ‘సింగం ఎగేన్’ నుంచి గట్టిపోటీ తప్పడం లేదు.
సింగం ఫ్రాంచైజీలో సింగం, సింగం రిటర్న్స్ తర్వాత వస్తున్న మూడో సినిమా సింగం ఎగేన్‌పై భారీ అంచనాలున్నాయి. రోహిత్‌శెట్టి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా కూడా ఆగస్ట్ 15న రిలీజ్ అవుతోంది. పుష్ప హిట్‌తో పుష్ప 2కు బాలీవుడ్‌లోనూ మాంచి హైప్ వున్నా అజయ్ దేవగణ్‌ను ఫేస్ చేయాల్సి వస్తుంది.