Ram Charan: జరగండి.. వస్తున్నాడు..! చరణ్ ఫ్యాన్స్‌కు థమన్ గుడ్ న్యూస్
గేమ్ ఛేంజర్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సినిమా మొదలై మూడేళ్లు కావస్తున్నా.. ఇప్పటికి రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు. దీంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గుడ్ న్యూస్ చెప్పాడు.

Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు గ్లోబల్ లెవల్‌కి చేరింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ వస్తుందా.. ఏ డైరెక్టర్‌తో మూవీ చేస్తాడు అంటూ అంతా ఎదురుచూశారు. అలాంటి సమయంలో దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్- డైరెక్టర్ శంకర్ కలిసి సినిమా చేయబోతున్నారు అంటూ ప్రకటించారు. ఇంకేముంది మెగా ఫ్యాన్స్ ఆడియన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గేమ్ ఛేంజర్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
Vishwak Sen: ఫ్లీజ్ సపోర్ట్ కావాలి.. గామి మూవీకి కూడా సపోర్ట్ చెయ్యండి..
సినిమా మొదలై మూడేళ్లు కావస్తున్నా.. ఇప్పటికి రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు. దీంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గుడ్ న్యూస్ చెప్పాడు. సాధారణంగా డైరెక్టర్ శంకర్‌తో సినిమా అంటే.. శంకర్ కొబ్బరికాయ కొట్టినంత ఈజీ కాదు. ఎందుకుంటే ఆయన ప్రాజెక్ట్‌కి గుమ్మడికాయ ఎప్పుడు కొట్టేది మాత్రం చెప్పడం కష్టమే అంటారు. అయితే ఓ వైపు గేమ్ ఛేంజర్.. మరోవైపు ఇండియన్ 2తో బిజీగా మారిపోయాడు శంకర్. దీంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ కాస్త వాయిదాల మీద వాయిదాలు పడటంతో పాటు ఎలాంటి అప్‌డేట్స్ లేకుండా అలాగే మిగిలిపోయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం అప్‌డేట్స్ మహా ప్రభో అంటూ.. నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. అలాంటి అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక గొప్ప శుభవార్త అందించాడు. రీసెంట్‌గా ఓ మ్యూజిక్ షోలో పాల్గొన్న థమన్.. గేమ్ ఛేంజర్ మూవీ గురించి ఓపెన్ అయ్యాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ఊరించారు. దీపావళి కానుకగా రిలీజ్ చేయాలనుకున్న జరగండి పాటను రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పాడు. అయితే ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఓ వైపు నిరాశగా.. మరోవైపు ఆనందంలో మునిగితేలుతున్నారు. లీకైన పాటను రిలీజ్ చేయడం ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తుంటే.. కనీసం పాట అయినా వస్తున్నందుకు సంతోషంగా ఉందని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు.