RAM CHARAN: గేమ్ ఛేంజర్ సాంగ్ వచ్చేస్తోంది..!
కొన్నిరోజుల క్రితం ఈ సినిమా తాలూకు పాటే ఒకటి లీకైంది. కాకపోతే హీరో, హీరోయిన్ల విజువల్స్ కాకుండా, టెస్ట్ కట్‌లా తెరకెక్కించిన పాట రా ఫుటేజీ లీకైంది. ఇప్పుడు ఆ పాట ఒరిజినల్ వర్షన్‌నే ఫిల్మ్ టీం దసరా స్పెషల్‌గా రిలీజ్ చేయబోతోందంటున్నారు.

RAM CHARAN: శంకర్ మేకింగ్‌లో రామ్ చరణ్ చేస్తున్నమూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమా పాట దసరాకు రిలీజ్ కాబోతోంది. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా తాలూకు పాటే ఒకటి లీకైంది. కాకపోతే హీరో, హీరోయిన్ల విజువల్స్ కాకుండా, టెస్ట్ కట్‌లా తెరకెక్కించిన పాట రా ఫుటేజీ లీకైంది. ఇప్పుడు ఆ పాట ఒరిజినల్ వర్షన్‌నే ఫిల్మ్ టీం దసరా స్పెషల్‌గా రిలీజ్ చేయబోతోందంటున్నారు. అంతేకాదు ఈ సినిమా ఆగస్ట్ 15 రిలీజ్ డేట్‌ని కూడా ఈ పాటతో పాటే విడుదల చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.
ఐతే మార్చ్ 22 కి కూడా ఈ సినిమా విడుదలకు ఛాన్స్ ఉంది. భారతీయుడు 2ని ఆగస్ట్ 15కి ప్లాన్ చేసి, మార్చ్ 22కి గేమ్ ఛేంజర్‌ని రిలీజ్ చేయాలనుకుంటున్నారనే అభిప్రాయం ఉంది. అయితే జనవరి 26కి భారతీయుడు 2 వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రజెంట్ జనవరి 26 భారతీయుడు 2, మార్చ్ 22 గేమ్ ఛేంజర్ రిలీజ్ అనుకుంటున్నారు. కాని రెండు సినిమాల మధ్య గ్యాప్ తక్కువుండటంతో ప్రమోషన్‌కి దర్శకుడికి టైం ఉండకపోవచ్చు. అందుకే ఆగస్ట్ 15కి పుష్ప 2తో పోటీకి చరణ్ సిద్దమవుతున్నాడంటున్నారు. అదే నిజమైతే ఇప్పడే గేమ్ ఛేంజర్ సాంగ్‌ని రిలీజ్ చేయటంలో అర్ధం లేదు.. ఏదేమైనా శంకర్ తెరకెక్కించే సినిమాలు రెండూ డిసెంబర్‌లోగా పూర్తవుతాయి.
ఇక ఈరెండు సినిమాలు కూడా జనవరి, మార్చ్, ఆగస్ట్ నెలల్లో ఎప్పుడు విడుదల చేయాలన్న కోణంలో ఇంకా ఫిల్మ్ టీం చర్చిస్తోంది. పాట మాత్రం దసరాకు రిలీజ్ అవటం పక్కా అయ్యింది.