Game Changer: 1200 మంది ఫైటర్లతో యాక్షన్ సీక్వెన్స్‌.. గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ ఫైట్‌‌పై క్రేజీ అప్డేట్‌!

గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్‌.. డైరెక్టర్ శంకర్‌ కాంబోలో వస్తున్న మూవీ గేమ్‌ఛేంజర్‌. ఈ మూవీ నుంచి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఇది క్రేజీ మాత్రమే కాదు.. అంతకుమించి! క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ను ఇంకా భారీగా ప్రజెంట్ చేస్తాడు శంకర్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 20, 2023 | 01:42 PMLast Updated on: Apr 20, 2023 | 1:42 PM

Ram Charans Massive Clash With 1000 Fighters For Game Changer

Game Changer: గ్రాండియర్‌నెస్‌కు కేరాఫ్‌గా ఉంటాయి సౌతిండియన్ సెన్సేషనల్‌ డైరెక్టర్ శంకర్ సినిమాలు. అలాంటి దర్శకుడికి మాస్‌ హీరో దొరికితే ఎలా ఉంటుంది అంటే గేమ్‌ఛేంజర్‌లా ఉంటుంది. గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్‌.. డైరెక్టర్ శంకర్‌ కాంబోలో వస్తున్న మూవీ గేమ్‌ఛేంజర్‌. ఈ మూవీ నుంచి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఇది క్రేజీ మాత్రమే కాదు.. అంతకుమించి!

శంకర్‌ సినిమాల్లో పాటలు ఎంత గ్రాండ్‌గా ఉంటాయో.. యాక్షన్‌ సీన్స్‌ కూడా అదే రేంజ్‌లో థ్రిల్‌ చేస్తాయ్. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ను ఇంకా భారీగా ప్రజెంట్ చేస్తాడు శంకర్‌. అపరిచితుడులో కుంగ్‌ఫూ ఫైట్ ఇప్పటికీ కళ్లముందే కదులుతుంటుంది ప్రతీ ఒక్కరికి! ఇప్పుడు గేమ్‌ఛేంజర్‌కు కూడా అలాంటి యాక్షన్‌ సీక్వేన్సే ప్లాన్ చేశాడు శంకర్. ఏకంగా 12వందల మంది ఫైటర్స్‌తో క్లైమాక్స్‌ ఫైట్‌ ప్లాన్ చేస్తున్నాడనేది తాజా న్యూస్. ఇప్పుడీ న్యూస్ చెర్రీ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. గేమ్‌ఛేంజర్‌ మూవీలో ఎస్‌జే సూర్య విలన్‌గా యాక్ట్ చేస్తుండగా.. అతను కూడా ఈ సీక్వెన్స్‌లో ఉంటాడని టాక్. ఈ నెల 23 నుంచి క్లైమాక్స్ ఫైట్ షూటింగ్‌ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఓ సాంగ్‌ కోసం రూ.40 కోట్లు ఖర్చు చేశాడు డైరెక్టర్.

దానికితోడు ఇప్పుడీ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ లీక్‌ కావడంతో మూవీ మీద అంచనాలు ఆకాశానికి చేరిపోయాయ్. ఈ యాక్షన్‌ సీన్స్‌ కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ సెట్‌ వేశారు. తన భార్య ఉపాసన ప్రెగ్నెంట్‌ కావడంతో.. చెర్రీ ఇప్పుడు ఎక్కువ టైమ్‌ ఆమెతోనే గడుపుతున్నాడు. ఈ మధ్యే హాలిడే ట్రిప్‌ కూడా వెళ్లి వచ్చారిద్దరూ. చెర్రీ వెకేషన్ పూర్తి కావడంతో ఈ నెల 23 నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇక అటు గేమ్‌ఛేంజర్‌ మూవీతో పాటు ఇండియన్-2 మూవీని కూడా ఒకేసారి డైరెక్ట్‌ చేస్తున్నాడు శంకర్‌.