RAM CHARAN-Jr NTR: జూనియ‌ర్ క‌థ‌తో చెర్రీ కొత్త సినిమా..? క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లేనా..?

ఈ మూవీ విష‌యంలో గ‌త కొన్నాళ్ల నుంచి కొన్ని రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. అప్పట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు సిద్ధం చేసిన కథే.. ఇపుడు రామ్ చరణ్ వద్దకి వెళ్ళింది అని కొన్ని పుకార్లు వినిపించాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 21, 2024 | 05:45 PMLast Updated on: Mar 21, 2024 | 5:45 PM

Ram Charans New Movie Rc 16 Was Once Jr Ntrs Script Here Is The Clarity

RAM CHARAN-Jr NTR: ట్రిపుల్ ఆర్ లాంటి గ్లోబ‌ల్ హిట్ త‌ర్వాత‌.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ నుంచి సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సౌత్ ఏస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో రిలీజ్ కానుంది. ఈ మూవీ షూటింగ్ ఆల్‌మోస్ట్ కంప్లీట్ కావ‌డంతో.. చరణ్​ తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేశాడు. బుచ్చిబాబు డైరెక్షన్​లో వస్తున్న ‘ఆర్సీ 16’ హైదరాబాద్​లో ఘనంగా ప్రారంభ‌మైంది. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాన‌ప్ప‌టికీ.. చెర్రీ ఫ్యాన్స్ మాత్రం పండ‌గ చేసేసుకుంటున్నారు.

Chiranjeevi: మెగా రిస్క్.. బురదలో చిరంజీవి.. అందుకే మెగాస్టార్ అయ్యారు!

చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే వారం రోజుల ముందే వ‌చ్చేసిందంటూ సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. కాగా.. ఆర్సీ 16పై ఇన్నాళ్లూ వినిపించిన ఓ రూమ‌ర్‌పై వ‌చ్చిన క్లారిటీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రామ్ చ‌ర‌ణ్-బుచ్చిబాబు కాంబోలో గ్రాండ్‌గా తెర‌కెక్కనున్న ఆర్సీ 16పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక ఈ మూవీ గురించి వ‌స్తున్న అప్‌డేట్స్ ఫ్యాన్స్‌ను ఊపేస్తున్నాయి. అయితే.. ఈ మూవీ విష‌యంలో గ‌త కొన్నాళ్ల నుంచి కొన్ని రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. అప్పట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు సిద్ధం చేసిన కథే.. ఇపుడు రామ్ చరణ్ వద్దకి వెళ్ళింది అని కొన్ని పుకార్లు వినిపించాయి. బుచ్చిబాబు ఈ చిత్ర కథ ముందుగా తారక్ కు చెప్పాడ‌ని.. అయితే తార‌క్ ఈ మూవీ చేద్దామనుకున్నప్పటికీ దేవర చిత్రం ఆలస్యమవుతుండటంతో.. తానే రామ్ చరణ్‌తో మాట్లాడి కథ విని ఓకే చేయాలని కోరిన‌ట్లు టాక్ వినిపించింది. తారక్ కోరిక మేరకు రామ్ చరణ్ కథ విని వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడంటూ న్యూస్ చ‌క్క‌ర్లు కొట్టింది.

దీనితో చాలా మంది అదే నిజం అనుకున్నారు. కానీ దీనిపై అసలు క్లారిటీ ఇప్పుడు వచ్చింది. ఈ సినిమా కథని చరణ్ కోసం బుచ్చిబాబు ఎప్పుడో రెడీ చేసుకున్నాడ‌ట‌. నిజానికి చెర్రీ “రంగస్థలం” టైం లోనే.. అంటే బుచ్చిబాబు తన డెబ్యూ చిత్రం “ఉప్పెన” క‌న్నా ముందే ఈ క‌థ‌ని ప్రిపేర్ చేసుకున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని సుకుమార్ రివీల్ చేశారు. అప్ప‌టి నుంచే బుచ్చిబాబు రామ్ చరణ్‌తో సినిమా చేయాలని బలంగా డిసైడ్ అయ్యాడ‌ని సుకుమార్ తెలిపారు. దీంతో ఆర్సీ 16 క‌థ‌పై వినిపిస్తున్న వార్త‌ల‌న్నీ ఉట్టి రూమ‌ర్లే అని తేలిపోయింది. కాగా.. వృద్ధి సినిమాస్ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.