RAM CHARAN: ముహూర్తం ఫిక్స్.. RC16 గ్రాండ్ లాంచ్ ఆ రోజే..!

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన డైరెక్ష‌న్‌లో రానున్న ఈ మూవీపై ఇప్ప‌టి నుంచే ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏర్ప‌డ్డాయి. హీరోయిన్‌గా అతిలోక సుంద‌రి త‌న‌య జాన్వీక‌పూర్ క‌న్‌ఫామ్ అయ్యింది. ఇక‌.. ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించ‌డం మ‌రింత క్రేజ్‌ను క్రియేట్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 15, 2024 | 11:00 AMLast Updated on: Mar 15, 2024 | 11:00 AM

Ram Charans Rc 16 Movie With Buchibabu Will Launch On March 20th

RAM CHARAN: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. శంక‌ర్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న గేమ్ ఛేంజ‌ర్ దాదాపుగా కంప్లీట్ అవ్వ‌డంతో. ఇక‌.. ఆర్‌సీ 16 ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన డైరెక్ష‌న్‌లో రానున్న ఈ మూవీపై ఇప్ప‌టి నుంచే ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏర్ప‌డ్డాయి.

Samantha: నిజస్వరూపం.. సమంతపై లివర్ డాక్టర్ మండిపాటు

హీరోయిన్‌గా అతిలోక సుంద‌రి త‌న‌య జాన్వీక‌పూర్ క‌న్‌ఫామ్ అయ్యింది. ఇక‌.. ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించ‌డం మ‌రింత క్రేజ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీకి సంబంధించి వినిపిస్తున్న ఓ లేటెస్ట్ బ‌జ్ ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తుతోంది. ఈ మూవీకి సంబంధించి మేక‌ర్స్ ఇటీవ‌లే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. స్పోర్ట్స్ రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీకి తెరకెక్కుతోంది. మూవీని మార్చి 20న గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు లేటెస్ట్‌గా టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్ప‌టికే మేక‌ర్స్ పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో భారీ బ‌డ్డెత్‌తో రూపొందుతున్న ఈ మూవీని వ‌చ్చే ఏడాది రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఆర్‌సీ 16 వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ మూవీకి సంబంధించి ఇప్ప‌టికే ప‌లు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి.

అందులో మెయిన్‌గా ఈ మూవీలో చెర్రీ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపిస్తాడ‌న్న న్యూస్ వైర‌ల్‌గా మారింది. గేమ్ ఛేంజ‌ర్ మూవీలోనూ రాం చ‌ర‌ణ్ డ్యూయ‌ల్ రోల్‌లో సంద‌డి చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఇదే నిజ‌మైతే.. చ‌ర‌ణ్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపిస్తాడ‌న్న వార్త‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.