పెద్ది సినిమాలో రామ్ చరణ్ షాకింగ్ రోల్.. ఆ పాత్ర చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ అభిమానుల ఆశలన్నీ పెద్ది సినిమా పైనే ఉన్నాయి. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 1, 2025 | 12:55 PMLast Updated on: Apr 01, 2025 | 6:47 PM

Ram Charans Shocking Role In The Movie Peddi Will Fans Agree To Play That Role

గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ అభిమానుల ఆశలన్నీ పెద్ది సినిమా పైనే ఉన్నాయి. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు.. చరణ్ కోసమే ఒక ప్రత్యేకమైన కథ సిద్ధం చేశాడు. గురువు సుకుమార్ మాదిరే ఈయన కూడా పూర్తిస్థాయిలో రా అండ్ రస్టిక్ సినిమాతో వస్తున్నాడు. పెద్ది ఫస్ట్ లుక్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ కూడా వచ్చేసింది అభిమానులకు. రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్ ఎలాగైతే రామ్ చరణ్ కెరీర్ లో అలా నిలబడిపోయిందో.. దాన్ని మించిన క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగే స్పోర్ట్స్ డ్రామాగా పెద్ది తెరకెక్కుతుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు.. నటుడిగా మరో పది మెట్లు రామ్ చరణ్ ఎక్కుతాడు అని నమ్మకంగా చెప్తున్నాడు బుచ్చిబాబు. ఈ సినిమా కథ గురించి చాలా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఏది ఎలా ఉన్నా ఒక న్యూస్ మాత్రం.. రామ్ చరణ్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ ను కూడా బాగా ఎక్సైట్ చేస్తుంది.

ఇందులో చరణ్ పాత్ర మరుగుజ్జు అని తెలుస్తుంది. మామూలుగా మరుగుజ్జు క్యారెక్టర్ అంటే మనకు కమల్ హాసన్ గుర్తుకొస్తాడు. అపూర్వ సోదరులు సినిమా కోసం ఈయన అలాంటి క్యారెక్టర్ చేశాడు. ఆ తర్వాత మరే హీరో కూడా ఈ క్యారెక్టర్ చేసే ధైర్యం చేయలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ మళ్ళీ అలాంటి ఒక డేరింగ్ క్యారెక్టర్ చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఒక స్టార్ హీరో ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి మామూలుగా అయితే సాహసం చేయడు. కానీ చరణ్ ఇప్పుడు పూర్తిగా ప్రయోగాల బాట పడుతున్నాడు. రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్ కు చెవులు వినిపించవు.. అలాగే గేమ్ చేంజెర్ లో అప్పన్న క్యారెక్టర్ నత్తితో ఉంటుంది. ఇప్పుడు బుచ్చిబాబు సినిమా కోసం మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. మొన్న విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం ఈజీగా అర్థమైపోతుంది. అందులో చరణ్ భుజం డిఫరెంట్ గా ఉంటుంది. మామూలుగా ఉండే కంటే కాస్త పొట్టిగా కనిపిస్తున్నాడు మెగా వారసుడు. అంతేకాదు అతని చేతిలో ఉన్న బ్యాట్ సైజ్.. చరణ్ కంటే కాస్త పెద్దగా కనిపిస్తుంది.

ఇవన్నీ చూస్తుంటే రామ్ చరణ్ నిజంగానే మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నాడేమో అని అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కచ్చితంగా పెద్ది క్యారెక్టర్ చరణ్ కెరీర్లో అలాగే నిలబడిపోతుంది అని కథ తెలిసిన వాళ్ళు చెబుతున్న మాట. ఈ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ తనను తాను చాలా మార్చుకుంటున్నాడు. ఊహించిన దాని కంటే ఎక్కువ మేకోవర్ అయ్యాడు. ఏప్రిల్ 6న ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. ఇది వస్తే గాని సినిమాలో చరణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే విషయంపై క్లారిటీ రాదు. అంతేకాదు ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఒకటి మరుగుజ్జు.. మరొకటి నార్మల్ క్యారెక్టర్..! జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 2026, మార్చి 26న పెద్ది సినిమా విడుదల కానుంది.