చిరంజీవి కూతురు సుష్మితకు రామ్ చరణ్ భార్య ఉపాసన విలువైన గిఫ్ట్..
వందల వేల కోట్ల ఆస్తులున్న వాళ్లు గిఫ్టులు ఇచ్చుకున్నారంటే వాటి వ్యాల్యూ ఏం రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ అన్నిసార్లు డబ్బుతోనే ప్రేమను చూపించలేం కదా..?

వందల వేల కోట్ల ఆస్తులున్న వాళ్లు గిఫ్టులు ఇచ్చుకున్నారంటే వాటి వ్యాల్యూ ఏం రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ అన్నిసార్లు డబ్బుతోనే ప్రేమను చూపించలేం కదా..? కొన్నిసార్లు డబ్బు కంటే విలువైన బహుమతులు కూడా ఉంటాయి. ఎన్ని వేల కోట్లు ఇచ్చినా వాటికి సాటిరావు. తాజాగా అలాంటి అద్భుతమైన గిఫ్ట్ ఒకటి తన వదిన సుష్మిత కొణిదెలకు ఇచ్చింది ఉపాసన. ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. వదిన అంటే మరదలికి చాలా ఇష్టం. చిరు ఇంట్లో సుష్మిత రేంజ్ వేరు. పెద్ద కూతురు కాబట్టి ఆమెకు రామ్ చరణ్ కూడా భయపడతాడు. అక్క అంటే చరణ్‌కు ప్రాణం. అలాగే ఆయన సతీమణి ఉపాసన కూడా సుష్మితకు చాలా మర్యాద ఇస్తుంది. వదిన అంటే ప్రాణంగా చూసుకుంటుంది.
అలాగే ఒకరికొకరు కానుకలు కూడా ఇచ్చుకుంటారు. ఒకరేమో మెగాస్టార్ కూతురు.. మరొకరు మెగాస్టార్ కోడలు కాబట్టి వాళ్లు ఇచ్చి పుచ్చుకునే గిఫ్టులు కూడా అంతే కాస్ట్ లీగా ఉంటాయేమో అనుకోవాల్సిన పనిలేదు. వాటిని మించిన బహుమతులు బాగానే ఉంటాయి. తాజాగా డబ్బు గురించి కాకుండా మంచి గిఫ్ట్ ఒకటి వదినకు పంపించింది ఉపాసన. తాజాగా ఒక అద్భుతమైన కానుకను మెగా కోడలు ఉపాసన తన ఆడపడుచు సుస్మిత కొణిదెలకు ఇచ్చారని తెలుస్తుంది. ఇక తనకు ఉపాసన ఇచ్చిన కానుకను సుస్మిత కొణిదెల సోషల్ మీడియా పోస్ట్ చేసింది. తన మరదలు తనపై చూపించిన ప్రేమకు పొంగిపోయింది ఈమె. ఉపాసనకు థ్యాంక్స్ చెప్తూ రిప్లై ఇచ్చింది. ఈ మధ్యే రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితుల సమక్షంలో ఉపాసన ఎంతో ఘనంగా నిర్వహించిన పార్టీ కూడా ఇచ్చింది.
తమ్ముడి పుట్టినరోజు వేడుకలలో సుస్మిత కూడా భాగమైంది. ఈ పార్టీకి వచ్చిన వాళ్లకే కాదు.. ఇంకా చాలా మందికి ఉపాసన గిఫ్టులు పంపించారు. ఈ క్రమంలోనే సుస్మిత కోసం ఉపాసన ప్రత్యేకమైన బహుమతి పంపించింది. శ్రీరామ పాదాలతో పాటు ఓ పుస్తకాన్ని కూడా గిఫ్టుగా ఇచ్చింది ఉపాసన. రామ్ చరణ్ భార్యకు దైవభక్తి కూడా ఎక్కువే. అందుకే సరైన నడవడిక ఉండాలని కోరుతూ.. జీవితంలో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ వదినకు శ్రీ రామ పాదాలను పంపించింది ఉపాసన. తనకు మరదలి నుంచి వచ్చిన గిఫ్ట్ చూసి సుష్మిత కూడా చాలా సంతోషించింది. ఇంత మంచి బహుమతి పంపించినందుకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. కెరీర్ పరంగా బిజీ అయిపోయింది సుష్మిత. మొన్నట వరకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఉన్న సుష్మిత.. ఇప్పుడు నిర్మాత అయిపోయింది. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాకు ఈమె ఓ నిర్మాతగా ఉంది.