Ram Gopal Varma: నా పెళ్లాం దెయ్యం అంటున్న ఆర్జీవీ.. కామెంట్స్ మిస్ అవ్వొద్దమ్మా..

వ్యూహం, శపథం అంటూ పొలిటికల్ హీట్ పుట్టించే సినిమాలు చేసి.. రాజకీయంగా సెగలు పుట్టించి ఆర్జీవీ.. ఇప్పుడు నా పెళ్లాం దెయ్యం అంటూ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఫోర్‌గ్రౌండ్‌లో ఓ తాళిబొట్టు.. వెనకాల కిచెన్‌లో ఓ మహిళ.. దాని మీద నా పెళ్లాం దెయ్యం, రాంగోపాల్‌వర్మ అని ఓ పోస్టర్ రిలీజ్‌ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2024 | 03:42 PMLast Updated on: Mar 20, 2024 | 3:42 PM

Ram Gopal Varma Announced New Movie Na Pellam Deyyam

Ram Gopal Varma: అందరికీ అర్థం అయ్యే జీవి కాదు ఆర్జీవీ.. ఎప్పుడు ఏం ట్వీటుతాడో.. ఎలాంటి మూవీ అనౌన్స్‌ చేస్తాడో.. మీడియా ముందుకు వచ్చి ఎలాంటి అనౌన్స్‌మెంట్ ఇస్తాడో అంత ఈజీగా అర్థం చేసుకోలేం. ఎలా ఉండేవాడిని ఇలా ఎందుకు అయ్యావు అంటే.. ఇలా ఉంటే నీకేం సమస్య అని నిలదీస్తాడు. అందుకే ఆర్జీవీని అర్థం చేసుకోవడం మానేసి.. ఆయన పనులను ఆనందించడం మొదలుపెట్టారు ఫ్యాన్స్.

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. వ్యూహం, శపథం అంటూ పొలిటికల్ హీట్ పుట్టించే సినిమాలు చేసి.. రాజకీయంగా సెగలు పుట్టించి ఆర్జీవీ.. ఇప్పుడు నా పెళ్లాం దెయ్యం అంటూ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఫోర్‌గ్రౌండ్‌లో ఓ తాళిబొట్టు.. వెనకాల కిచెన్‌లో ఓ మహిళ.. దాని మీద నా పెళ్లాం దెయ్యం, రాంగోపాల్‌వర్మ అని ఓ పోస్టర్ రిలీజ్‌ చేశాడు. ఈ సినిమా నిజంగా తీస్తాడా.. తీసినా రిలీజ్ చేస్తాడా.. అది థియేటర్‌లో వస్తుందా, ఓటీటీకే పరిమితం అవుతుందా అనే సంగతి ఎలా ఉన్నా.. ఆర్జీవీ షేర్‌ చేసిన పోస్టర్ కింద కామెంట్లు మాత్రం కితకితలు పెడుతున్నాయ్. కొందరు పవన్ కల్యాణ్ కామెంట్లను ట్యాగ్‌ చేస్తూ కామెంట్‌ చేస్తుంటే.. మరికొందరు మాత్రం నా పెళ్లాం కూడా దెయ్యమే.. నాకేం భయం అంటూ ఫన్నీగా రాసుకొస్తున్నారు.

ఇంకొందరు మాత్రం ఎలా ఉండేవాడిని ఇలా అయిపోయావ్ ఏంటి ఆర్జీవీ అంటూ జాలిపడుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా తెలుగులో దెయ్యం మూవీ ట్రెండ్‌ క్రియేట్ చేసింది ఆర్జీవీనే. దెయ్యం, రాత్‌, భూత్ అంటూ ఆ మధ్య వరుస పెట్టి దెయ్యాల సినిమాలు చేశాడు. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి బయోపిక్‌ల మీద పడ్డాడు. మళ్లీ ఆ తర్వాత పొలిటికల్‌ మూవీస్‌ చేశాడు. ఇప్పుడు మళ్లీ పెళ్లాం దెయ్యం అంటూ వస్తున్నాడు ఆర్జీవీ. ప్రతీ సినిమా ప్రమోషన్‌లో క్రియేటివిటీ చూపించే వర్మ.. మరి ఈ సినిమా కోసం ఏం చేస్తాడో !