Poonam Pandey: అనుకున్నది సాధించావు.. పూనమ్‌పై ఆర్జీవీ ట్వీట్..
కేవలం 32 ఏళ్ళ వయసులో పూనమ్ మరణించింది అన్న వార్తతో అందరూ షాకయ్యారు. సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా ఆమె మరణ వార్త నుంచి బయటపడని వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి సమయంలో తూచ్.. తాను బ్రతికే ఉన్నాను అంటూ ఇంకా బిగ్ షాక్ ఇచ్చింది.
Poonam Pandey: నేనూ ఎన్నో మోసాలు చేశానురా.. కానీ ఇలాంటి మోసం ఎప్పుడూ చేయలేదు అంటూ ‘అదుర్స్’ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది పూనమ్ పాండే చేసిన పని చూస్తుంటే. బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే.. సర్వైకల్ క్యాన్సర్‌తో మృతి చెందినట్లు ఆమె సన్నిహితులు ప్రకటించారు. కేవలం 32 ఏళ్ళ వయసులో పూనమ్ మరణించింది అన్న వార్తతో అందరూ షాకయ్యారు. సంతాపం వ్యక్తం చేశారు.
Sandeep Reddy Vanga: వివాదాల్లో దర్శకులు.. సందీప్, సిద్ధార్థ్‌పై విమర్శలు
ఇంకా ఆమె మరణ వార్త నుంచి బయటపడని వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి సమయంలో తూచ్.. తాను బ్రతికే ఉన్నాను అంటూ ఇంకా బిగ్ షాక్ ఇచ్చింది పూనమ్. తాను చనిపోలేదని తెలుపుతూ తాజాగా పూనమ్ పాండే ఓ వీడియోను విడుదల చేసింది. తాను చనిపోయినట్లు చేసిన ప్రకటన కేవలం సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కోసమే అని పూనమ్ పాండే వెల్లడించిన నేపథ్యంలో నెట్టింట్లో ట్రోల్ అవుతుంది. దీనిపై తాజాగా ఆర్జీవి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘హేయ్ పూనమ్ పాండే.. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నీవు ఎంచుకున్న విధానం కొంత విమర్శలకు తావివ్వొచ్చు. అందులో సదుద్దేశం ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు. దీని ద్వారా నువ్వు ప్రజల ప్రేమను పొందొచ్చు, పొందకపోవచ్చు.
కానీ అంతటా గర్భాశయ క్యాన్సర్‌పైనే చర్చ జరుగుతోందంటే దానికి కారణం నువ్వే. మార్గం ఏదైనా అనుకున్నది సాధించావు. నీ మాదిరేగానే నీ ఆత్మ కూడా చాలా అందమైనది. సంపూర్ణమైన, సంతోషకరమైన జీవితం నీకు ఉంటుందని విశ్వసిస్తున్నాను’ అని ఆర్జీవి పోస్ట్ చేశారు. మొత్తానికి పూనమ్ పాండే చేసిన పనికి.. అవగాహన పేరుతో ఇలాంటి ప్రాంక్ చేసినందుకు బాధపడాలో, ఆమె బ్రతికే ఉందని తెలిసి సంతోషపడాలో తెలియట్లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Hey @iPoonampandey the extreme method u employed to draw attention to this issue might attract some criticism , but no one can question ur INTENT nor what u ACHIEVED with this HOAX .. Discussion on cervical cancer is TRENDING all across now 🙏🙏🙏 Your SOUL is as BEAUTIFUL as YOU…
— Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2024