RAM GOPAL VARMA: పవన్‌కు అందుకే 24 సీట్లు.. ట్వీట్‌తో పిచ్చెక్కించిన ఆర్జీవీ…
టీడీపీ 94, జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. 24 సీట్లలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది జనసేన. జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే కేటాయించడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్.
RAM GOPAL VARMA: చంద్రబాబు, పవన్‌ను టార్గెట్ చేస్తూ.. వ్యూహం, శపథం అనే సినిమాలు రెడీ చేస్తున్న ఆర్జీవీ.. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు మీద తన మార్క్ సెటైర్లు వేశాడు. టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడిగా ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేశాయ్. టీడీపీ 94, జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. 24 సీట్లలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది జనసేన. జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే కేటాయించడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్.
JANASENA KAPU COMMUNITY: కస్సుమంటున్న కాపులు.. జనసేనకు 24 సీట్లపై రగిలిపోతున్న కాపులు
దీని మీద కాంట్రవర్షియల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. పవన్ గాలి తీసేలా రాతలు రాసుకొచ్చాడు. జనసేనకు 24 సీట్లు ఎందుకిచ్చారో తెలుసా అంటూ తన మార్క్ దిక్కుమాలిన ఎనాలిసిస్ పోస్ట్ చేశాడు. 23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు.. 25ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారని ట్రోల్ చేస్తారు. అందుకే మధ్యే మార్గంగా పవన్ కల్యాణ్‌కు 24స్థానాలు ఇచ్చారని సెటైర్లు వేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. పొద్దుపొద్దున్నే బూమ్‌బూమ్ బీర్ తాగావా అని కొందరు ఆర్జీవీని ఆడుకుంటుంటే.. నువ్ ఒక మానసిక రోగివి త్వరగా కోలుకో అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
దీంతో ఆర్జీవీ ట్వీట్ ఇప్పుడు హాట్‌టాపిక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. ఆర్జీవీ మాత్రమే కాదు.. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయించడంపై.. అధికార పార్టీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. పల్లకీ మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావు అంటూ.. మంత్రి అంబటి ట్వీట్ చేశారు. ఛీ పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్ చేశారు.