Ram Gopal Varma: తెలంగాణలో జనసేన ఓటమి.. పవన్‌పై మరోసారి వర్మ సెటైర్లు..

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేదని వర్మ సోషల్ మీడియా ద్వారా పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశాడు. జ‌నసేన ఓట‌మి గురించి విశ్లేషించుకుంటూ ప‌వ‌న్‌పై కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు చేసాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 6, 2023 | 04:24 PMLast Updated on: Dec 06, 2023 | 4:24 PM

Ram Gopal Varma Satires On Pawan Kalyan About Politics

Ram Gopal Varma: రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. వివాదస్పదంగా ఏదో ఒక ట్వీట్ చేస్తుంటాడు. అందులో ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అవకాశం దొరికినప్పుడల్లా వర్మ విమర్శలు చేస్తుంటాడు. అయితే తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేదని వర్మ సోషల్ మీడియా ద్వారా పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశాడు. జ‌నసేన ఓట‌మి గురించి విశ్లేషించుకుంటూ ప‌వ‌న్‌పై కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు చేసాడు.

REVANTH REDDY: ఆమెకే మొదటి ఉద్యోగం! హామీ నిలబెట్టుకుంటున్న రేవంత్..

రివ్యూ మీటింగ్స్‌లో భాగంగా త‌న పార్టీని.. త‌న‌ను ఓడించ‌డానికి రూ.150 కోట్లు ఖ‌ర్చు చేసార‌ని.. త‌న‌కు కుయుక్తులు, త‌ప్పుడు రాజ‌కీయాలు చేయ‌డం రావ‌ని చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. ఆర్యభట్ట గణితశాస్త్రంలో సున్నాని ఆవిష్కరిస్తే.. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సున్నాని కనిపెట్టాడని ట్వీట్ చేశాడు. జనసేన ఒక్క సీటు కూడా సంపాదించుకోలేదని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైందని విమర్శిస్తూ ఈ విధంగా ట్వీట్ చేశాడు. జనసేన.. బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా.. అన్ని చోట్ల కూడా డిపాజిట్లు కోల్పోయింది. కూకట్‌పల్లి నుంచి పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌కు మాత్రమే చెప్పుకోగిన ఓట్లు వచ్చాయి. మిగతా ఏడు చోట్ల కూడా అభ్యర్థులకు ఓట్లు పడలేదు.

కూకట్‌పల్లి‌తో పాటు ఖమ్మం, నాగర్‌కర్నూలు, కోదాడ, కొత్తగూడెం, వైరా, తాండూరు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో జనసేన తన అభ్యర్థులను బరిలోకి దింపింది. పవన్ కల్యాణ్‌తో పాటు బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసినా జనసేన అభ్యర్థులకు పెద్దగా ఓట్లు పడలేదు. వర్మ మాటిమాటికి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారంటూ ఆయ‌నపై రివ‌ర్స్ కౌంట‌ర్ వేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మొత్తానికి ప‌వ‌న్, వ‌ర్మ మ‌ధ్య మాట‌ల యుద్ధం ఎప్పుడు ఆగుతుందో చూడాలి.