RAM GOPAL VARMA: వర్త్ వర్మా వర్త్.. అమ్మాయి వీడియో పోస్ట్ చేసిన ఆర్జీవీ.. కామెంట్స్ మిస్ అవొద్దమ్మా..!
ఆర్జీవీ పుణ్యమాని.. చాలామంది అమ్మాయిలు లైమ్‌లైట్‌లోకి వస్తుంటారు. ఓవర్‌నైట్ స్టార్లు అయిపోతుంటారు. అలా ఆర్జీవీ ట్వీట్, ఇంటర్వ్యూతో బిగ్‌బాస్‌కు వెళ్లిన వాళ్లు ఉన్నారు. ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్లు కూడా ఉన్నారు.

RAM GOPAL VARMA: ఏం చేసినా.. ఏం చేయకపోయినా సంచలనమే అన్నట్లు ఉంటుంది ఆర్జీవీ వ్యవహారం. సోషల్ మీడియాను వర్మ వాడుకున్నంతలా.. మరొకరు వాడరు.. వాడలేరు కూడా ! తన సినిమాలే కాదు.. పక్క దర్శకుడి సినిమాలకు కూడా తన మార్క్ రివ్యూలు ఇస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా ఉంటారు. ఈ మధ్యే హనుమాన్ గురించి ఆర్జీవీ చెప్పిన మాటలు తెగ వైరల్ అయ్యాయ్. ఉండి ఉండి.. సడెన్‌గా ఎవరో అమ్మాయి ఫొటో పెట్టి.. అడ్రస్ ప్లీజ్ అంటుంటాడు వర్మ.
SALAAR 2: సలార్ 2.. ఆ సినిమా కన్నా ముందే.. ప్రశాంత్ నీల్ ప్లాన్ ఇదే..!
ఆర్జీవీ పుణ్యమాని.. చాలామంది అమ్మాయిలు లైమ్‌లైట్‌లోకి వస్తుంటారు. ఓవర్‌నైట్ స్టార్లు అయిపోతుంటారు. అలా ఆర్జీవీ ట్వీట్, ఇంటర్వ్యూతో బిగ్‌బాస్‌కు వెళ్లిన వాళ్లు ఉన్నారు. ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి ఆర్జీవీ ఆ మధ్య.. ఓ అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు. ఈమె ఎవరు.. మీకు తెలుసా అంటూ.. శ్రీలక్ష్మీ సతీష్ అనే బ్యూటీ వీడియో పోస్ట్ చేశాడు. చీరకట్టులో అదుర్స్ అనిపించేంత అందంగా ఉండే.. ఆ అమ్మాయి గురించి ఆ మధ్య రెండుమూడు రోజులు జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. ఐతే శ్రీలక్ష్మీ సతీష్ వీడియోను ఆర్జీవీ ఎందుకు షేర్ చేశాడా అనే అనుమానం డిస్కషన్ దగ్గరే ఆగిపోయింది అప్పుడు. ఆ తర్వాత అమ్మాయితో సినిమా అనౌన్స్ చేసిన వర్మ.. మళ్లీ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఐతే ఇప్పుడు ఇంకో వీడియో పోస్ట్ చేసి.. మళ్లీ ఓ క్వశ్చన్ వదిలాడు. ఆ అమ్మాయి చేసిన మరో వీడియోను ట్విటర్‌లో పంచుకున్నాడు.
ఆ వీడియోతో అభిమానులకు ఓ ఆసక్తికర ప్రశ్న సంధించాడు ఆర్జీవీ. ఆమె సంగీతం వింటోందా.. లేదంటే సంగీతమే ఆమె నుంచి వచ్చిందా అంటూ ప్రశ్నించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయ్యా.. చిన్న పిల్లయ్యా అంటూ కొందరు సెటైర్లు వేస్తుంటే.. ఇంతకుమించి ఇంకేం పనిలేదా వర్మ నీకు అంటూ ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు. ఇంకెన్నాళ్లు ఇలా ఉంటావ్ వర్మ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఐతే ఆ వీడియో కింద కామెంట్లు మాత్రం పొట్ట చెక్కలు చేస్తున్నాయ్.
Can somebody tell me if she’s listening to the music ???? , or is the music coming out of her ???? pic.twitter.com/zNxR7HaBMh
— Ram Gopal Varma (@RGVzoomin) January 29, 2024