RAM GOPAL VARMA: టీ గ్లాస్ సింక్‌లోకి విసిరేసిన వర్మ.. వైరల్ ట్వీట్
రాప్తాడులో ఏపీ సీఎం జగన్.. సిద్ధం పేరుతో సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇస్తూ.. సైకిల్ ఇంటి బయట ఉండాలి, టీ గ్లాస్ సింక్‌లో ఉండాలి అంటూ స్పీచ్ ఇచ్చారు జగన్. ఈ సభ ముగిసిన వెంటనే.. సూపర్ డైలాగ్ అంటూ.. జగన్ స్పీచ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆర్జీవీ.
RAM GOPAL VARMA: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది వివాదాస్పదం కావడం గ్యారెంటీ. కావాలనే ఇలాంటి పనులు చేస్తాడో.. లేక ఇలాంటి పనులు చేస్తాడు కాబట్టి ఆయనను ఆర్జీవీ అంటున్నారో తెలియదు కానీ.. ఆయన చేసే ఏ పనీ సింపుల్‌గా, సైలెంట్‌గా ఉండదు. సినిమా తీసినా అంతే.. ట్వీట్ చేసినా అంతే.. ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో ఆయనకు అదో ఆనందం. రీసెంట్‌గా రాప్తాడులో ఏపీ సీఎం జగన్.. సిద్ధం పేరుతో సభ ఏర్పాటు చేశారు.
Arvind Dharmapuri: నియంత అర్వింద్ వెళ్లిపో.. నువ్ మాకొద్దు.. బీజేపీ నేతల తిరుగుబాటు..
ఆ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇస్తూ.. సైకిల్ ఇంటి బయట ఉండాలి, టీ గ్లాస్ సింక్‌లో ఉండాలి అంటూ స్పీచ్ ఇచ్చారు జగన్. ఈ సభ ముగిసిన వెంటనే.. సూపర్ డైలాగ్ అంటూ.. జగన్ స్పీచ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆర్జీవీ. సరే ఏదో అభిమానంతో చేశాడులే అనుకుందామా అంటే అక్కడితో ఆగలేదు. ఓ టీ గ్లాస్‌ను నిజంగానే సింక్‌లో విసిరిరేస్తూ వీడియో తీసుకున్నాడు.. ఆ వీడియోను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడు. అంతే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దారి తీసింది. జగన్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ పోటాపోటీగా కామెంట్లు పెడుతున్నారు. గుద్దితే ఫ్యాన్ ఊడిపోతుందంటూ కొందరు కామెంట్స్ పెడితే.. కరెంట్ లేని ఫ్యాన్ ఉన్నా లేకున్నా ఒకటే అంటూ మరికొందరు తిట్టిపోస్తున్నారు.
రెండు నెలల్లో ఎన్నికలు ముగిసిన తరువాత ఎవరు బయట ఉంటారో ఎవరు జైల్‌లో ఉంటారో చూద్దామంటూ వర్మ ట్వీట్‌కు రిప్లై ఇస్తున్నారు. ఇక వైసీపీ అభిమానులు మాత్రం వర్మ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వాళ్లు కూడా వాళ్ల సింకుల్లో గాజుగ్లాస్‌లు పెట్టి.. ఎలక్షన్స్ తరువాత ఇదే పరిస్థితి అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇలా ట్వీట్‌తో మంట పెట్టి ఆ కామెంట్లు చూస్తు ఏంజాయ్ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.
— Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2024