Ram Gopal Varma: ఆ అమ్మాయి గురించి ఆర్జీవీ ఆరా.. నీ కళ్లు పడ్డాయా..? పాపం వదిలెయ్‌..!

ఆర్జీవీ ఇప్పుడు మరో అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు. ఈమె ఎవరు..? మీకు తెలుసా అంటూ..? వీడియో పోస్ట్‌ చేశాడు. ఆ అమ్మాయి కోసం సెర్చింగ్ మొదలుపెట్టాడు. ఆ అమ్మాయే శ్రీలక్ష్మీ సతీష్. ఇన్‌స్టాలో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. చీరకట్టులో అదుర్స్ అనిపించేంత అందంగా ఉంటుందీ అమ్మాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 27, 2023 | 06:42 PMLast Updated on: Sep 27, 2023 | 6:42 PM

Ram Gopal Varma Tweeted About A Woman And Asking Who Is She

Ram Gopal Varma: ఆర్జీవీ మాట్లాడినా, ట్వీటినా, తిట్టినా.. ప్రతీది సంచనలమే..! సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో రకంగా చర్చకు దారి తీస్తూనే ఉంటాడు. వర్మ ఇప్పుడు వేసిన ట్వీట్ మీద కొత్త చర్చ మొదలైంది. ఆర్జీవీ పుణ్యమా అని కొంతమంది అమ్మాయిలు లైమ్‌లైట్‌లోకి వస్తుంటారు. కొన్ని రోజులు నెట్టింట్లో హడావిడి చేస్తుంటారు. బిగ్‌బాస్ వరకు వెళ్తుంటారు. నగ్నం బ్యూటీ శ్రీ రాపాక, అరియానా, అషూ రెడ్డి, అప్సరా రాణి, నైనా గంగూలీ.. ఇలా ఆర్జీవీ పుణ్యమా అని వెలుగులోకి వచ్చిన వాళ్ల లిస్ట్ పెద్దదే..!

అలాంటి ఆర్జీవీ ఇప్పుడు మరో అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు. ఈమె ఎవరు..? మీకు తెలుసా అంటూ..? వీడియో పోస్ట్‌ చేశాడు. ఆ అమ్మాయి కోసం సెర్చింగ్ మొదలుపెట్టాడు. ఆ అమ్మాయే శ్రీలక్ష్మీ సతీష్. ఇన్‌స్టాలో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. చీరకట్టులో అదుర్స్ అనిపించేంత అందంగా ఉంటుందీ అమ్మాయి. ఐతే శ్రీలక్ష్మీ సతీష్ వీడియోను ఆర్జీవీ ఎందుకు షేర్ చేశాడు అనే దాని మీద రకరకాల చర్చ జరుగుతోంది. తన సినిమాలోని ఏదైనా ఒక పాత్రకు సెట్ అవుతుందని పోస్ట్ చేశాడా.. అని మరికొందరు అనుకుంటున్నారు. ఆర్జీవీ ట్వీట్ మీద కొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంటే.. ఇంకొందరు మాత్రం ఫన్నీగా, నెగటివ్‌గా స్పందిస్తున్నారు. ఆర్జీవీ కన్ను ఆ అమ్మాయి మీద పడింది.. పాపం ఆ అమ్మాయిని వదిలేయ్ అంటూ ఇలా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది మాత్రం ఆమె ఇన్‌స్టా ఐడీని, ఆమె పేరుని కనుక్కుని మరీ చెప్పేస్తున్నారు. శ్రీలక్ష్మీ సతీష్ మాత్రం ఆర్జీవీ వేసిన ట్వీట్‌ను వెంటనే చూసినట్టుంది.

తన ఇన్‌స్టా స్టోరీలో ఆర్జీవీ వేసిన ట్వీట్‌ను స్క్రీన్‌షాట్ తీసి పెట్టేసింది. మలయాళంలో ఏదో రాసుకుని తెగ సంబరపడిపోయింది. అంటే వర్మ కంట్లో పడటంతో శ్రీ లక్ష్మీ కూడా ఫుల్ ఖుషీ అయినట్టుగా ఉంది. ఇక రేపోమాపో వర్మతో… ఆ నేచురల్ బ్యూటీ కనిపించేలా ఉంది. మల్లూ పిల్ల తెలుగులోకి త్వరలోనే ఎంట్రీ ఇచ్చేలా ఉందని నెటిజన్లు రాసుకొస్సతున్నారు. శ్రీలక్ష్మీ సతీష్ గురించి అయితే ఇప్పుడు నెట్టింట్లో బాగానే చర్చలు నడుస్తున్నాయ్. వర్మ పెట్టిన వీడియో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆమె ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్లు కూడా పెరుగుతున్నారు.