Ram Gopal Varma: లైన్ క్లియర్.. పట్టు వదలని విక్రమార్కుడు.. విడుదలకు సిద్ధమైన వ్యూహం

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ తాజాగా రూపొందించిన చిత్రం వ్యూహం. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత వచ్చేసింది. విడుదలపై సస్పెన్స్ వీడిపోయింది. వరుస వాయిదాలతో విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 28, 2024 | 04:04 PMLast Updated on: Feb 28, 2024 | 4:04 PM

Ram Gopal Varma Tweeted About Vyooham Movie Release

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒకప్పుడు క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్ గా చూసేవారు. టాలీవుడ్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో చక్రం తిప్పిన ఘనత వర్మ ది. సినిమాలను ఓ ఫ్యాక్టరీ పద్ధతిలో నిర్మించిన రామ్ గోపాల్ వర్మ.. ఎంతోమంది శిష్యులను రెడీ చేసి ఇండస్ట్రీకి అందించాడు. అలాంటి వర్మ ఇప్పుడు వివాదాలకు అడ్డాగా మారాడు. రామ్ గోపాల్ వర్మ ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్నాడనే విమర్శలు చాన్నాళ్ల నుంచి వినిపిస్తున్నాయి. ఈ కోవలోనే.. వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం‘ సిరీస్ సెన్సార్ అడ్డంకులను ఎదుర్కొంది.

LIQUOR CASE TICKETS: ఏంటీ రాజకీయాలు..? లిక్కర్ కేసులో ఉన్నోళ్ళకే టిక్కెట్లు.. పోటీలు పడుతున్న వైసీపీ,టీడీపీ

అలాంటి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ తాజాగా రూపొందించిన చిత్రం వ్యూహం. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత వచ్చేసింది. విడుదలపై సస్పెన్స్ వీడిపోయింది. వరుస వాయిదాలతో విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది. కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో మార్చి 2న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యూహం విడుదల విషయాన్ని తెలియజేస్తూ రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను చూపిస్తూ.. పట్టు వదలని విక్రమార్కుడిని అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మార్చి 2న వ్యూహం సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.ఏపీ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సినిమాను మొదటి నుంచీ వివాదాలు చుట్టుముట్టాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఏపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యూహం సినిమాను రాంగోపాల్ వర్మ తెరకెక్కించారు.

అయితే, ఈ సినిమాపై టీడీపీ, జనసేన వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జగన్ పొలిటికల్ మైలేజీ కోసం తమ నాయకులను కించపరిచేలా చూపించాడంటూ ఇరు పార్టీలకు చెందిన నేతలు ఆర్జీవీపై మండిపడుతున్నారు. ఈ సినిమాను విడుదల చేయకుండా ఆపాలని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కోర్టుకెక్కారు. దీంతో గతేడాది డిసెంబర్ 29 న విడుదల కావాల్సిన సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రెండు నెలల తర్వాత థియేటర్లలోకి రానుంది. కోర్టు ఆదేశాలతో సినిమా విడుదలను పలుసార్లు వాయిదా వేసిన ఆర్జీవీ.. పట్టు వదలకుండా పోరాటం చేశారు. ఎట్టకేలకు వ్యూహం విడుదలకు అనుమతి తెచ్చుకున్నారు.