RAM GOPAL VARMA: నీకోసమే వ్యూహం రిలీజ్ డేట్ మార్చా.. 23 నంబర్‌తో చంద్రబాబును ఆడుకున్న ఆర్జీవీ..
16న వ్యూహం మూవీ రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నా.. 23కు విడుదల తేదీని మార్చాడు ఆర్జీవీ. అలా ఎందుకు ఛేంజ్ చేశాడా అనుకుంటుండగానే.. వోడ్కాకు మళ్లీ పని పెట్టినట్లు ఉన్నాడు వర్మ. ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పెద్ద పోస్ట్ రాసుకొచ్చాడు.
RAM GOPAL VARMA: వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే ఆర్జీవీ ఇప్పుడు మరో వివాదాస్పద మూవీతో రాబోతున్నాడు. ఏపీ పాలిటిక్స్ ఆధారంగా వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు రెడీ చేసి.. ప్రింట్లు ఇంట్లో పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇన్నాళ్లు కోర్టులో కేసు ఉంది కాబట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. రెండోసారి సెన్సార్ చేసి రిలీజ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో.. వ్యూహం మూవీకి రూట్ క్లియర్ అయింది. 16న వ్యూహం మూవీ రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నా.. 23కు విడుదల తేదీని మార్చాడు ఆర్జీవీ.
HARISH SHANKAR: చిరు, బాలయ్య నుంచి ఆఫర్.. ముందు నుయ్యి వెనక గొయ్యిలా హరీష్ శంకర్ పరిస్థితి..?
అలా ఎందుకు ఛేంజ్ చేశాడా అనుకుంటుండగానే.. వోడ్కాకు మళ్లీ పని పెట్టినట్లు ఉన్నాడు వర్మ. ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పెద్ద పోస్ట్ రాసుకొచ్చాడు. చంద్రబాబును ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో 9మంది పాయింట్లు ఉంటే.. అన్ని పాయింట్లు 23 చుట్టే తిరుగుతాయ్. అందుకే 23కి రిలీజ్ అంటూ చెప్పుకొచ్చాడు. చంద్రబాబు లక్కీ నెంబర్ 23.. వైసీపీ నుంచి బాబు లాక్కున్న MLAలు 23.. 2019 ఎన్నికల్లో తాను ఓడిపోయానని తెలుసుకున్న తేదీ 23.. బాబు గెల్చుకున్న ఎమ్మెల్యే స్థానాలు 23.. బాబు అరెస్టయిన తేదీ 9-9-23, వీటన్నింటిని కలిపితే వచ్చేది 23.. స్కిల్ కేసులో 2023లో కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ ఇచ్చిన తేదీ సెప్టెంబర్ 23.. చంద్రబాబు ప్రిజన్ నెంబర్ 7691, అన్నీ కలిపితే 23.. CBN, NTR దగ్గర నుంచి లాక్కున్న పార్టీకి వారసుడిగా చేద్దామనుకుంటున్న లోకేష్ పుట్టినరోజు 23.. వ్యూహం సినిమా జగగర్జన ఈవెంట్ 23.. వ్యూహం సినిమా రిలీజ్ 23 అంటూ ఆర్జీవీ రాసుకొచ్చాడు. నిజానికి ఏపీ రాజకీయాల్లో 23 అనే నంబర్ చాలా వివాదాస్పదంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో.. 23 చుట్టూ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.
23మంది ఎమ్మెల్యేలను లాక్కున్న టీడీపీ.. 23 స్థానాల్లో మాత్రమే గెలిచిందని.. అదీ 23వే తేదీన సైకిల్ పార్టీ ఓడిపోయిందని.. ఫ్యాన్ పార్టీ నేతలు ఘాటు విమర్శలు గుప్పించారు ఆ మధ్య ! ఇప్పుడిప్పుడే 23నంబర్‌ను ఏపీ రాజకీయం మర్చిపోతుంది అనుకుంటున్న సమయంలో.. 23తేదీ వ్యూహం సినిమా రిలీజ్ చేస్తూ.. 23వ దశకం అన్నట్లు.. ఆర్జీవీ ఓ పది పాయింట్లు రాసుకురావడంతో.. నెట్టింట్లో ఆసక్తికర చర్చ మొదలైంది.