RAM GOPAL VARMA: పిఠాపురంలో పవన్‌పై పోటీగా ఆర్జీవీ.. ఏ పార్టీ నుంచి..?
ఇన్నాళ్లు రాజకీయాల గురించి మాట్లాడిన వర్మ.. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తా అంటున్నాడు. ఆర్జీవీ చేసిన ఓ ట్వీట్ సెన్సేషన్‌గా మారింది. తాను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నానని.. ఇది సడెన్‌గా తీసుకున్న నిర్ణయం అంటూ ఓ ట్వీట్ షేర్ చేశాడు వర్మ.

RAM GOPAL VARMA: ఆర్జీవీ ఏం చేసినా వివాదమే ! ఇక రాజకీయాల మీద వర్మ వేసే సెటైర్లు.. చేసే ట్వీట్లు మాములుగా ఉండవ్. పవన్, టీడీపీని.. వర్మ మాములుగా ఆడుకోడు. చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా.. పవన్‌ను మాత్రం ఎప్పుడూ వెంటాడుతుంటాడు వర్మ. ఆర్జీవీ.. ఎప్పుడు.. ఎలాంటి బాంబు పేల్చుతారో చెప్పడం కష్టమే.. ఇప్పుడు అలాంటి పనే చేశాడు. ఇన్నాళ్లు రాజకీయాల గురించి మాట్లాడిన వర్మ.. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తా అంటున్నాడు.
PAWAN KALYAN: పిఠాపురం నుంచి బరిలోకి జనసేనాని.. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న పవన్
ఆర్జీవీ చేసిన ఓ ట్వీట్ సెన్సేషన్‌గా మారింది. తాను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నానని.. ఇది సడెన్‌గా తీసుకున్న నిర్ణయం అంటూ ఓ ట్వీట్ షేర్ చేశాడు వర్మ. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని.. పవన్ ఇలా అనౌన్స్ చేశాడో లేదో.. నిమిషాల గ్యాప్‌లో ఆర్జీవీ నుంచి ఈ సెటైరికల్ ట్వీట్ కనిపించింది. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంటూ ఆర్జీవీ రాసుకొచ్చాడు. ఐతే ఆర్జీవీ పవన్‌పై సెటైరికల్‌గా ఈ ట్వీట్ చేశారా..? లేక పవన్‌కు పోటీగా ఆర్జీవీ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారా.. సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. ఆర్జీవీ ట్వీట్లు అంత ఈజీగా అర్థం కావు. ఇప్పుడు ఈ ట్వీట్ ఇలానే కనిపిస్తోంది.
పవన్ మీద సెటైర్లు వేయాలనే ఇలాంటి రాతలు రాశారా.. లేదంటే పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయి అలాంటి ట్వీట్ చేశాడా.. ఆర్జీవీ అంతరంగం ఏంటి.. మనసులో మెదిలుతోంది ఏంటి.. వింతగా ఆలోచించే జీవి అని పేరు తెచ్చుకున్న ఆర్జీవీ.. పిఠాపురం విషయం ఎందుకు ఎత్తుకున్నట్లు అంటూ.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. అయితే, వైసీపీ మద్దతుదారు అయిన ఆర్జీవీ ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారా అంటున్నారు నెటిజన్లు.
SUDDEN DECISION..Am HAPPY to inform that I am CONTESTING from PITHAPURAM 💪💐
— Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2024