Pawan Kalyan: పవన్‌పై ఆర్జీవీ ఫేక్ ఎడిట్.. ఫ్యాన్స్ ఫైర్..
పవన్ కల్యాణ్ మ్యాటర్ అయితే చాలు.. రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ పోస్ట్‌లు పెడుతూ తన పైశాచిక ఆనందంలో మునిగిపోతుంటాడు. పవన్ పొలిటికల్ లైఫ్, సినిమా కెరీర్.. సబ్జెక్ట్ ఏదైనా ఊరుకోకుండా కంపు కంపు చేస్తాడు.

Pawan Kalyan: రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. ఎవరిపై ఏం అనిపించినా కడుపులో పెట్టుకోకుండా సోషల్ మీడియాలో కక్కెస్తాడు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ మ్యాటర్ అయితే చాలు సెటైరికల్ పోస్ట్‌లు పెడుతూ తన పైశాచిక ఆనందంలో మునిగిపోతుంటాడు. పవన్ పొలిటికల్ లైఫ్, సినిమా కెరీర్.. సబ్జెక్ట్ ఏదైనా ఊరుకోకుండా కంపు కంపు చేస్తాడు. రీసెంట్‌గా పవన్ కల్యాణ్.. వాలంటీర్ వ్యవస్థలోని కొంతమందిపై ఓ రేంజ్‌లో ఫైరయ్యాడు.
హిట్లర్ నిఘా వ్యవస్థలాగా ఆరోపించాడు. జర్మనీలో హిట్లర్ ఇలానే చేసేవాడని, దీనిని వాలంటీర్లు కూడా గమనించి నడుచుకోవాలని పవన్ కల్యాణ్ హితవు పలికాడు. ఈ మ్యాటర్ జరిగిన కొన్ని రోజులకు వర్మ రియాక్ట్ అయ్యాడు. అలా ఇలా కాదు.. తన పైత్యాన్ని అంతా చూపించాడు. ఆ మధ్య పవన్ వారాహి యాత్ర కోసం విజయవాడలో నిర్వహించిన పూజ ఫోటోను ఉపయోగించుకున్నాడు. పవన్ కళ్యాణ్ కాషాయం కండువాని కప్పుకొని ఉన్న ఫోటోని వర్మ ఎడిట్ చేశాడు. అక్కడితో ఆగకుండా.. ఆ కండువాపై వర్మ శివుడి రూపంలో ఉన్న పిక్‌ని ఎడిట్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. శివ శివ శివా అని కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే వర్మ చేసిన పనితో పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ఫేక్ ఎడిట్లు చేసి ఏం సాధించావంటూ ప్రశ్నిస్తున్నారు. వర్మ.. నీ పైత్యానికి ఇదో పరాకాష్ట అంటూ మండిపడుతున్నారు. వైసిపి సపోర్ట్‌తో ఇలా చేయడం కరెక్ట్ కాదని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి పవన్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్‌పై వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.