రామం రాఘవం’ రివ్యూ.. కమెడియన్ ధన్ రాజ్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా..?
ఈ మధ్య జబర్దస్త్ కమెడియన్లు వరుసగా దర్శకులుగా మారుతున్నారు. బలగం సినిమాతో వేణు.. నాలో నేను సినిమాతో శాంతి కుమార్ మెగా ఫోన్ పెట్టారు. ఇప్పుడు రామం రాఘవ అంటూ ధనరాజ్ కూడా దర్శకుడి అవతారం ఎత్తడు.

ఈ మధ్య జబర్దస్త్ కమెడియన్లు వరుసగా దర్శకులుగా మారుతున్నారు. బలగం సినిమాతో వేణు.. నాలో నేను సినిమాతో శాంతి కుమార్ మెగా ఫోన్ పెట్టారు. ఇప్పుడు రామం రాఘవ అంటూ ధనరాజ్ కూడా దర్శకుడి అవతారం ఎత్తడు. మరి ఈయన తొలి సినిమా ఎలా ఉంది పూర్తి రివ్యూలో చూద్దామా..కథ విషయానికి వస్తే.. దశరథ రామం అంటే మన సముద్రఖని గారు రిజిస్టర్ ఆఫీసులో నిజాయితీగా పనిచేసే ఒక అధికారి. చిన్నప్పటి నుంచి నీతి న్యాయం అంటూ పెరుగుతాడు. తన కళ్ళ ముందు అన్యాయం జరిగితే అసలు సహించడు. అలాంటి రామం కొడుకు రాఘవ.. అంటే ధనరాజ్ చిన్నప్పటి నుంచి బేవార్స్ గా తిరుగుతాడు. తప్పు మీద తప్పు చేస్తూ తండ్రికి తలనొప్పిగా మారతాడు. చివరికి ఓ సందర్భంలో తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి చాలా పెద్ద తప్పు చేస్తాడు. దాంతో కొడుకుని పోలీసులకు అప్పగిస్తాడు రామం. కనీసం ఆ తర్వాతైనా మారుతాడు అనుకుంటే ఇంకాస్త మూర్ఖంగా ప్రవర్తించడమే కాకుండా ఏకంగా తండ్రిని చంపడానికి ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది నిజంగానే తండ్రిని చంపేంత కోపం కొడుకుకి ఎందుకు వచ్చింది.. చివర్లో వాళ్ళిద్దరూ కలిసారా లేదా అనేది కథ..
కథనం విషయానికి వస్తే.. సాధారణంగా కమెడియన్లు దర్శకత్వం చేస్తున్నారు అనగానే వెంటనే కామెడీ సినిమా చేస్తారు అనుకుంటారు. కానీ బలగం సినిమాతో తమకు కామెడీ మాత్రమే కాదు ఎమోషన్ కూడా వస్తుంది అని వేణు నిరూపించాడు. ఇప్పుడు ధనరాజ్ కూడా ఇదే చేశాడు. రామం రాఘవం పూర్తిగా తండ్రీ కొడుకుల నేపథ్యంలో జరిగే ఎమోషనల్ డ్రామా. ఎక్కడ ట్రాక్ తప్పకుండా తాను అనుకున్నది అనుకున్నట్టు స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు ధనరాజ్. కాకపోతే ఫస్ట్ ఆఫ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. సిన్సియర్ అధికారి అయిన తండ్రి.. జులాయిగా తిరిగే కొడుకు.. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు అందుకే ఇంటర్వెల్ వరకు సినిమా పెద్దగా కొత్తదనంగా అనిపించదు.
ధనరాజ్ ఎప్పుడైతే తన తండ్రిని చంపాలని నిర్ణయించుకొని.. ఆ దిశగా తన ప్రయత్నాలు ప్రారంభిస్తాడో.. అప్పటినుంచి కథనంలో వేగం పుంజుకుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందా అనే ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అయితే క్లైమాక్స్ లో ఒక మంచి ట్విస్ట్ రాసుకొని.. అప్పటివరకు తన తండ్రి విషయంలో తాను ఎంత పెద్ద తప్పు చేశాను అని కొడుకు రిగ్రెట్ అయ్యేలా సన్నివేశాలు రాసుకున్నాడు ధనరాజ్. ఈ సినిమాకు క్లైమాక్స్ ప్రాణం. రొటీన్ సినిమానే కానీ ఖచ్చితంగా తండ్రి కొడుకుల ఎమోషన్ బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు.నటీనటుల విషయానికి వస్తే.. రాఘవ పాత్రలో ధనరాజ్ చాలా బాగా నటించాడు. తనలో కేవలం కామెడీ మాత్రమే కాదు ఎమోషన్ కూడా ఉంది అని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. రామం పాత్రకు ప్రాణం పోసాడు సముద్రఖని. ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. లారీ డ్రైవర్ పాత్రలో హరీష్ ఉత్తమన్ బాగున్నాడు. మిగిలిన నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే.. ఈ సినిమాకు అరుణ్ అందించిన సంగీతం బాగుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ ఆఫ్ కాస్త షార్ప్ చేసి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టు ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. ఇక దర్శకుడిగా ధనరాజ్ డిస్టింక్షన్ లో కాకపోయినా మార్జిన్ లో పాస్ అయిపోయాడు. లేనిపోని హంగులకు పోకుండా అనుకున్న కథను అనుకున్నట్టుగా స్క్రీన్ మీద చూపించడంలో సక్సెస్ అయ్యాడు. చివరగా చెప్పాలంటే.. రామం రాఘవం.. తండ్రి కొడుకుల ఎమోషన్ బాగానే ఉంది కానీ థియేటర్ కంటే ఓటీటీలో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.