Ramabanam: గురితప్పిన రామబాణం.. హిట్ కాంబోకు ఝలక్.. రామబాణం ఫుల్ మూవీ రివ్యూ..
చాలా కాలం నుంచి మంచి హిట్ కోసం ట్రై చేస్తున్న హీరో గోపీచంద్.. తనకు బాగా కలిసివచ్చిన డైరెక్టర్ శ్రీవాస్‌తో తన లక్‌ను పరీక్షించుకున్నాడు. శ్రీవాస్ డైరెక్షన్‌లో వచ్చిన రామబాణం సినిమా ఇవాళ థియేటర్స్‌లో రిలీజైంది. మంచి హిట్ కాంబోగా పేరున్న వీళ్లిద్దరు గతంలో లక్ష్యం, లౌక్యం సినిమాలు తీశారు.
ఆ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్లు కావడంతో రామబాణం సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈసారి గోపీచంద్‌కు హిట్ రావడం పక్కా అని అంతా అనుకున్నారు. కానీ ఆడియన్స్ టాక్ వింటుంటే గోపీచంద్ రామబాణం గురి తప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. విలువలు, నియమాలతో బ్రతికే ఓ అందమైన ఉమ్మడి కుటుంబం వాళ్లది. ఈ కుటుంబాన్ని విలన్ డిస్ట్రబ్ చేస్తాడు. అప్పుడు ఆ ఫ్యామిలీలో ఒకడైన హీరో రంగంలోకి దిగుతాడు. శత్రువుల ఆట కట్టిస్తాడు.
ఇది చాలా ఏళ్లుగా చాలా మంది దర్శకులు వాడేసిన మాస్ కమర్షియల్ సబ్జెక్ట్. రొటీన్ కథతో ఆడియన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశాడు శ్రీవాస్. దీంతో ఫస్ట్ డే ఆడియన్స్‌ను పెద్దగా రెస్పాన్స్ రావడంలేదు. రొటీన్ కథ అవ్వడంతో యావరేజ్ టాక్ కూడా రాలేదు. మంచి సక్సెస్ సినిమాలతో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, హిట్ కాంబోగా పేరున్న గోపీచంద్, శ్రీవాస్‌కు ఈ సినిమా పెద్ద షాకిచ్చింది. గతంలో వచ్చిన లక్ష్యం సినిమాలో జగపతిబాబు గోపీచంద్‌కు అన్నగా నటించాడు.
అప్పట్లో ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన లౌక్యం కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించింది. దీంతో అదే ఫార్ములాను మరోసారి ట్రై చేశాడు శ్రీవాస్. కానీ ఒకే ఫార్ములా ప్రతీసారి పనిచేయదు. ఎమోషన్స్ బేస్డ్‌గా సినిమా తీసినా.. చాలా సీన్స్‌లో ఎమోషన్ పెద్దగా పండలేదు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. కామెడీ పర్వాలేదు అనిపించినా.. చాలా సీన్స్‌లో ల్యాగ్ అనిపించింది. ఇక గోపీచంద్ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రం కొంత మేర ఆడియన్స్‌ను మెప్పించాయి.
మిక్కీజే మేయర్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను అలరించింది. సినిమాటోగ్రఫీ పరంగా కూడా ఆడియన్స్ పల్స్‌ను పట్టుకోలేకపోయారు మేవీ మేకర్స్. ఓవరాల్‌గా ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజైన రామబాణం సినిమా మొదటి రోజు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ శ్రీవాస్, గోపీచంద్ కాంబోకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అనే పేరుంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి. అక్కడ కూడా నెగటివ్ రెస్పాన్స్ వస్తే గోపీచంద్‌కు మరో ఫ్లాప్ పడ్డట్టే.