Ramajogayya Sastry: గుంటూరు కారాన్ని రచయిత మీద చల్లేస్తున్నారా?
పాటలు బాగున్నాయి.. అద్భుతం అంటే రిసీవ్ చేసుకుంటారు. బాగోలేదంటే విమర్శలను రిసీవ్ చేసుకోలేరా అని కొందరంటే.. పాటలు బాగున్నాయంటే ఇలా కుక్కలతో పోలుస్తూ విమర్శకులు తిట్టరు కదా అని మరొకరన్నారు.

Ramajogayya Sastry: గుంటూరు కారం మొదటి పాట పేలింది. రెండో పాట ట్రోలింగ్‌కి గురైంది. తమన్ ట్యూన్ బాలేదని కొందరంటే, లిరిక్స్ బాగాలేవని ఇంకొందరు చీల్చి చెండాడుతున్నారు. ఇది నచ్చకే పాటల రాచయిత రామజోగయ్య శాస్త్రి ఒళ్లు దగ్గర పెట్టుకోమంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే ట్విట్టర్ నుంచి పారిపోయాడు. ఆరేంజ్‌లో ఫ్యాన్స్ కామెంట్లతో కుమ్మేశారు. పాటలు బాగున్నాయి.. అద్భుతం అంటే రిసీవ్ చేసుకుంటారు.
Bigg Boss Season 7 : జ్యోతిషుడిగా అమర్.. ఆడేసుకున్న శివాజీ, అర్జున్
బాగోలేదంటే విమర్శలను రిసీవ్ చేసుకోలేరా అని కొందరంటే.. పాటలు బాగున్నాయంటే ఇలా కుక్కలతో పోలుస్తూ విమర్శకులు తిట్టరు కదా అని మరొకరన్నారు. ఇంకొందరైతే శాస్త్రీ.. నీకో దండం.. మావోడికి ఇకపై పాటలు రాయకూడదు అన్నాడు. తమన్‌ను మ్యూజిక్ చేయొద్దని మొక్కాడు. ఇక ఇంకొకరైతే సరస్వతి పుత్ర అన్న బిరుదు తీసేసుకోవాలని రామజోగయ్య శాస్త్రికి సూచించారు. ఇంతేకాదు కొందరైతే అభ్యంతరకర భాష కూడా వాడారు. ఇంతేనా.. కింగ్ మూవీలో అరేయ్ శాస్త్రి సీన్‌ని వేసి అలా కూడా ట్రోల్ చేస్తున్నారు.
మొత్తానికి ఓ పాట బాగోలేకపోయినా ఇలా కూడా వైరలౌతోందనే న్యూట్రల్ జనం కూడా ఉన్నారు. ఏదేమైనా గుండు మీద కారం పూస్తాం లాంటి బ్యాడ్ వర్డ్స్‌తో కూడా లిరిసిస్ట్ మీద మాటల దాడి కంటిన్యూ అవుతోంది.