Ramcharan: ఆట మొదలైంది..గేమ్ ఛేంజర్‌గా రామ్ చరణ్.. RC15 టైటిల్ ఇదే..

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం టైటిల్ రిలీజ్ చేశారు మేకర్స్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2023 | 12:14 PMLast Updated on: Mar 27, 2023 | 12:14 PM

Ramcharan Pan India Director Movie

ఈరోజు చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC15 టైటిల్ లోగో వీడియో కాసేపటి క్రితం విడుదల చేస్తూ.. చెర్రీకి బర్త్ డే విషెస్ తెలిపింది చిత్రయూనిట్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ గేమ్ ఛేంజర్ గా ఫిక్స్ చేశారు. టైటిల్ రివీల్ చేస్తూ.. విడుదల చేసిన వీడియో చూస్తుంటే.. పూర్తిగా పాలిటిక్స్ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇందులోచరణ్ ప్రక్కన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లీక్ అయిన పోస్టర్స్ మూవీపై ఆసక్తిని పెంచాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ పుట్టినరోజు సెలబ్రెషన్స్ ఘనంగా జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. తమ అభిమాన హీరోకు వినూత్నంగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.