Ramya Krishnan: హీరోయిన్స్ అంటే మేమే.. యంగ్ హీరోయిన్స్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు..
ఒకప్పుడు హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల్లో అవకాశాలు వచ్చేవని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక హిట్ పడితే వరుసగా ఆఫర్లు వస్తున్నాయని.. అదే సినిమా ఫ్లాపైతే అవకాశాలు పెద్దగా ఇవ్వడంలేదని చెప్పుకొచ్చారు.

Ramya Krishnan: ఎవర్ గ్రీన్ టాలీవుడ్ హాట్ లేడీ రమ్యకృష్ణ నేటి తరం హీరోయిన్ల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటితో కంపేర్ చేస్తే తమ టైంలో పరిస్థితులు వేరేలా ఉన్నాయంటూ చెప్పారు. ఒకప్పుడు హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల్లో అవకాశాలు వచ్చేవని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక హిట్ పడితే వరుసగా ఆఫర్లు వస్తున్నాయని.. అదే సినిమా ఫ్లాపైతే అవకాశాలు పెద్దగా ఇవ్వడంలేదని చెప్పుకొచ్చారు. కెరీర్ విషయంలో కూడా ఇప్పుడున్న హీరోయిన్స్ భవిష్యత్తు చాలా తక్కువ అంటూ చెప్పారు రమ్యకృష్ణ.
కొన్నేళ్లలోనే చాలా మంది యంగ్ హీరోయిన్స్ కనుమరుగయ్యారంటూ చెప్పారు. తమలా 25 ఏళ్లకు పైగా హీరోయిన్‌గా కంటిన్యూ అవ్వడం ఇప్పటి జెనరేషన్ హీరోయిన్స్‌కు సాధ్యమయ్యే విషయం కాదన్నారు. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఇప్పటి హీరోయిన్స్ చాలా అదృష్టవంతులని చెప్పారు రమ్యకృష్ణ. ఒకప్పుడు ఏళ్లు కష్టపడి తాము సంపాదించుకున్న డబ్బు.. ఇప్పటి హీరోయిన్లు చాలా సింపుల్‌గా, తక్కువ టైంలో సంపాదిస్తున్నారంటూ చెప్పారు. ఆ విషయంలో మాత్రం ఈ జెనరేషన్ హీరోయిన్స్ లక్కీ అంటూ రెండు జెనరేషన్లను కంపేర్ చేశారు. తాజాగా రమ్యకృష్ణ సినీ పరిశ్రమలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.