Gunashekar: మహేశ్, చిరంజీవి కాపాడితే.. రానా మోసం చేశాడు..?
రానా యూఎస్ లోని శాన్ డియాగోలో తన కొత్త మూవి హిరణ్య కశ్యప లుక్ ని వదిలాడు. ఆ పాత్రతో వచ్చే కామిక్ బుక్ మీద ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ఇక ఇదే పాత్రతో సినిమా చేస్తూనే నిర్మించబోతున్నాడని తేల్చాడు. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాయబోతున్నాడని తేల్చాడు.

Rana cheating Gunasekhar and handing over the script work of his Hiranya Kashyapa movie to Trivikram became a hot topic
అంతా బానే ఉంది. కాని గుణశేఖర్ ని అటు రానా, ఇటు త్రివిక్రమ్ ముంచేస్తున్నారనంటున్నారు. ఎందుకంటే హిరణ్య కశ్యప పాత్రతో పాన్ వరల్డ్ మూవీ తీయాలని గుణశేఖర్ కొన్నేళ్లుగా ట్రై చేస్తున్నాడు. రుద్రమాదేవి షూటింగ్ టైంలోనే రానాని ఈ ప్రాజెక్ట్ కోసం గుణ ఒప్పించాడు.
కట్ చేస్తే రుద్రమాదేవి ఫ్లాపైంది. హిరణ్య కశ్యప దారి మళ్లింది. శాకుంతలం తీస్తే అది డిజాస్టర్ అయ్యింది. అందుకే గుణ మీద నమ్మకం పోయి, తన ప్రస్థావనే లేకుండా హిరణ్య కశ్యపని ఎనౌన్స్ చేశాడు రానా అంటున్నారు. నిజానికి గుణ ఈ కథ చెప్పినప్పుడు త్రివిక్రమే మాటలు రాస్తా అన్నాడట. అలాంటిది ఇప్పుడు గుణశేఖర్ ప్రస్థావనే లేకుండా ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయడమంటే, ఈ ప్రాజెక్ట్ ని తన నుంచి లాక్కోవటమే అంటున్నారు. అంతే కాదు దేవుడి పాత్రతో సినిమా తీసే వాల్లు అనైతిక మార్గాల్లో వెలితే నైతిక సమాధానం, భయంకరంగా ఉంటుందనే అర్ధం వచ్చేలా పోస్ట్ పెట్టీ మరీ గుణశేఖర్ తన నిరసనను తెలిపాడు. దీంతో ఇండస్ట్రీలో ఇదో వివాదంగా మారే ప్రాజెక్ట్ అంటున్నారు.