Rana Naidu: రానా నాయుడు 2 టీజర్ రిలీజ్.. ఈసారి బీప్‌లు అంతకుమించి.!
రానా నాయుడు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. బూతులు మాట్లాడిన వెంకీ మామను డైజెస్ట్ చేసుకోలేకపోయారు చాలామంది. ఓటీటీ అంటే అంతేలే అని ఆ తర్వాత అడ్జస్ట్ అయిపోయారు. ఐతే ఓ వర్గం ఆడియన్స్ సపోర్ట్‌తో సక్సెస్ అయిన రానా నాయుడుకు.. ఇప్పుడు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్.
మీ అందరి ప్రేమకి థ్యాంక్స్ మీ రానానాయుడు వస్తున్నాడు అంటూ వీడియో స్టార్ట్ చేస్తూ.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ వెంకటేష్ డైలాగ్‌తో వీడియో ఎండ్ అవుతుంది. ఫస్ట్ సీజన్ మీద మిక్స్‌డ్ ఒపీనియన్ కనిపించింది. తమ ఫేవరెట్ హీరోతో బూతులు మాట్లాడిస్తారా అని ఒక బ్యాచ్.. రొడ్డ రొటీన్ పాత్రలతో ప్రయోగాలు చేస్తారా అని ఇంకో బ్యాచ్.. కథలో కొత్తదనం ఎక్కడ బాస్ అని మరో బ్యాచ్.. ఇలా చాలామంది చాలా రకాల అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా బయటకు చెప్పారు. దీంతో తెలుగు వర్షన్‌ను యాప్ నుంచి డీలీట్ చేసిన పరిస్థితి.
నిజానికి ఈ సిరీస్ గురించి మేకర్స్ ముందు నుంచే చెప్తూ వచ్చారు. అడల్ట్ కంటెంట్ డోస్‌కు మించి ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు. ఐనా సరే సిరీస్ చూసి పెదవి విరిచారు చాలామంది. నిజానికి రానానాయుడు.. ఒరిజినల్ సబ్జెక్ట్ కాదు. అమెరికన్ టీవీ సిరీస్.. రే డోనోవన్‌కు ఇది రీమేక్ ! క్రైమ్ డ్రామా జోనర్‌లో ఈ సిరీస్ నడుస్తుంటుంది. స్టోరీ కొత్తగా ఉన్నా.. స్క్రీన్ ప్లే స్లో కావడంతో.. మంచి సిరీస్ కావాల్సింది, బిలో యావరేజీగా మిగిలిపోయింది.
మీర్జాపూర్‌లాంటి సిరీస్ నచ్చినవాళ్లకు మాత్రమే.. రానా నాయుడు కాస్త ఎక్కింది. మిగతావాళ్లంతా నుదురు చిట్లించినవాళ్లే ! ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు సీజన్ 2 అనౌన్స్ చేయడం.. కొత్త చర్చకు దారి తీస్తోంది. మరి ఇదెన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి మరి.