Rana: బాబాయ్ – అబ్బాయిల బూతు పురాణం రానా నాయుడు

ఇటీవలె కాలంలో ఓటీటీ వేదికగా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. కొన్ని పాజిటివ్ టాక్ సంపాధించుకుంటుంటే, మరికొన్ని చెత్త టాక్ సంపాధించుకుంటున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2023 | 03:54 PMLast Updated on: Mar 12, 2023 | 3:54 PM

Rana React About Rana Naidu Movie

వెంకటేశ్‌, రానా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. సుప్రన్‌ వర్మ, కరణ్‌ అన్షుమన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. మార్చి 10న విడుదలైన ఇది సుమారు రెండు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లోకి చేరింది. ఇదే విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ తెలియజేసింది. భారత్‌ టాప్‌ ట్రెండింగ్‌ షోల్లో ‘రానా నాయుడు’ ప్రథమ స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.

దీనిపై తాజాగా రానా స్పందించారు. అయితే, ఈ సిరీస్‌లో శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు, అసభ్య పదజాలం ఉందని పలువురు నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. మంచి ఇమేజ్‌ని పక్కన పెట్టి వెంకీ, రానా ఇలాంటి సిరీస్‌లో నటించడాన్ని వాళ్లు తప్పుబట్టారు. రానా- వెంకీ నుంచి ఇలాంటిది ఊహించలేదని.. కుటుంబంతో కలిసి దీన్ని చూడలేకపోతున్నామని.. ట్వీట్స్‌ పెట్టారు. ఈ క్రమంలో రానా వాళ్లందరికీ సారీ చెప్పారు. మరోవైపు ఈ క్రైమ్‌, యాక్షన్‌ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లోకి రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తమ సిరీస్‌కు ఇంతటి ఆదరణ అందించిన సినీ ప్రియులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ట్వీట్‌ చేశారు. అలాగే, ఈ సిరీస్‌ను కుటుంబంతో కాకుండా ప్రతి ఒక్కరూ ఒంటరిగా చూడాలని మరోసారి స్పష్టం చేశారు.