Ranbir Kapoor: ఫస్ట్‌ టైమ్‌ కూతురిని చూపించిన అలియా, రణ్‌బీర్‌.. ఎంత ముద్దుగా ఉందో..

క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా.. తమ ఇంటి దగ్గరకు విచ్చేసిన జర్నలిస్టులను ఈ జోడీ పలకరించింది. తమ కుమార్తెను పరిచయం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 25, 2023 | 07:50 PMLast Updated on: Dec 25, 2023 | 7:50 PM

Ranbir Kapoor Alia Bhatt Introduce Daughter Raha To Public For The First Time

Ranbir Kapoor: కూతురు రాహాను కెమెరా ముందుకు తీసుకువచ్చారు బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌. క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా.. తమ ఇంటి దగ్గరకు విచ్చేసిన జర్నలిస్టులను ఈ జోడీ పలకరించింది. తమ కుమార్తెను పరిచయం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. రాహా క్యూట్‌గా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

PALLAVI PRASHANTH: పల్లవి ప్రశాంత్‌ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌.. వాళ్లు ఎవరంటే..

బ్రహ్మాస్త్ర మూవీ టైమ్‌లో రణ్‌బీర్‌, ఆలియా ప్రేమలో పడ్డారు. రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో గతేడాది ఏప్రిల్‌ 14న వీళ్ల పెళ్లి జరిగింది. గత ఏడాది నవంబర్‌లో పాప పుట్టింది. తమ పాపకు రాహా అనే పేరు పెట్టామంటూ ఆలియా గతంలో ఓ పోస్ట్‌ పెట్టారు. వివిధ భాషల్లో ఆ పేరుకు అర్థమేంటో తెలిపారు. రాహా అంటే దైవ మార్గమని, సంస్కృతంలో వంశమని, బెంగాలీలో విశ్రాంతి, సౌకర్యం, ఉపశమనం, అరబిక్‌లో శాంతి, సంతోషం, స్వేచ్ఛ అని చెప్పారు. పాప రాకతో తమ జీవితం ఆనందంగా మారిందని పలు సందర్భాల్లో ఈ జంట చెప్పింది. ఇన్నాళ్లు పాప పేరు మాత్రమే తెలిసిన అభిమానులకు.. ఇప్పుడు లిటిల్‌ ప్రిన్సెస్ కనిపించింది.

పాప చాలా క్యూట్‌గా ఉందని.. ముద్దొస్తుందని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇక అటు యానిమల్‌ మూవీతో రణ్‌బీర్‌ సూపర్‌ హిట్‌ కొట్టాడు. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ యానిమల్‌ కలెక్షన్ల వర్షం కురిపించింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. ఇక అటు ఆలియా భట్‌.. రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ, హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌తో ప్రేక్షకులను అలరించింది. రణ్‌బీర్‌ పాపను ఎత్తుకొని.. మీడియా వాళ్లను చూపిస్తూ.. హాయ్‌ చెప్పు అంటూ పాపకు చెప్పిన వీడియో చూసి.. అభిమానులు తెగ మురిసిపోతున్నారు.