Ranbir Kapoor: కింగ్ ఖాన్ తర్వాత బాలీవుడ్‌ని ఏలే పనిలో రణ్‌బీర్ కపూర్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ టీవీలోంచి వచ్చి షారుఖ్‌లానే బాలీవుడ్‌ని ఏలబోయాడు. కానీ, తను ఆత్మహత్య చేసుకోవడం అందర్ని షాక్‌కి గురిచేసింది. సరే ఇప్పుడున్న హీరోల్లో రణ్‌వీర్ సింగ్‌కి అంత సీన్ లేదనిపిస్తోంది.

Ranbir Kapoor: షారుఖ్ ఖాన్ 60ల్లోకి ఎంటరవుతున్నాడు. ఎంత గ్రాఫిక్స్ వాడి తనని యంగ్‌గా చూపించినా.. జవాన్, పటాన్‌లో తన ముసలి తనం ఎంతో కొంత కనిపిస్తూనే వచ్చింది. కాబట్టి ఇంకా బాలీవుడ్ కింగ్, బాలీవుడ్ బాద్‌షా షారుఖే అంటే యంగ్ లేడీస్ మనసు పారేసుకునే ఛాన్స్ లేదు. అందుకే అర్జెంట్‌గా తన స్థానంలో పాతుకుపోయే హీరో ఎవరా అంటే కాస్త కష్టమే అంటున్నారు. ఎందుకంటే అప్పట్లో హీరోలకి కటౌట్లు కట్టి, ఫ్యాన్స్‌గా పాలాభిషేకాలు చేయటం కామన్.
Prabhas: రాజాసాబ్.. ఆ రేంజ్‌లో ఉంటుందా.. అంచనాలు పెంచేస్తున్న నటుడి కామెంట్స్
అది కూడా కేవలం సౌత్‌లోనే. బాలీవుడ్ పరిస్థితులు వేరు. ఇప్పుడున్న జనరేషన్ ఫేవరెట్ హీరోలకు కటౌట్లు కట్టడమో, పాలాభిషేకాలు చేయటమో అనేదే లేదు. సో.. ఒకప్పటిలా స్టార్‌డమ్‌ని ఇప్పుడున్న బ్యాచ్ అందుకోవటం కష్టం. కాని రణ్‌బీర్ కపూర్ ట్రై చేస్తున్నాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ టీవీలోంచి వచ్చి షారుఖ్‌లానే బాలీవుడ్‌ని ఏలబోయాడు. కానీ, తను ఆత్మహత్య చేసుకోవడం అందర్ని షాక్‌కి గురిచేసింది. సరే ఇప్పుడున్న హీరోల్లో రణ్‌వీర్ సింగ్‌కి అంత సీన్ లేదనిపిస్తోంది. కారణం.. తను మంచి నటుడే అయినా సీరియస్‌నెస్ తక్కువుగా ఉండటంతో మరో షారుఖ్ అనే పరిస్థితి లేదు.
అందుకే అటూ కపూర్ ఖాన్‌దాన్, ఇటు యానిమల్ లాంటి హిట్లతో వచ్చిన ఇమేజ్.. అలానే నటన మీదున్న గ్రిప్ పరంగా చూస్తే రణ్‌బీర్ కపూర్ మాత్రమే నెక్ట్స్ షారుక్ అనిపించుకునే అన్ని అర్హతలున్న హీరో. యానిమల్ సీక్వెల్‌తో పాటు బ్రహ్మస్త్ర 2, రామాయణం కూడా హిట్టైతే తనకి ఎదురులేదు. బాలీవుడ్ నయా బాద్ షా తనే అనక తప్పదు.