Rangasthalam Vs KGF: సుకుమార్ మేజిక్- ప్రశాంత్ నీల్ మేకింగ్.. వార్ లో విన్నర్ ఎవరు ?
కెజిఫ్ గొప్పదా రంగస్థలం గొప్పదా అని ఎవరైనా కొచ్చెన్ వేస్తే.. అరే బాబు అదేం ప్రశ్న అని చిరాకు పడతాము ఎందుకంటే కెజిఫ్ సృష్టించిన బీభత్సాలు.. రంగస్థలం క్రేయేట్ చేసిన అరాచకాలు మనకు తెలుసు. 2018 లో రిలీజైన మెగా హిట్ మూవీ రంగస్థలం లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందింది.
ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. హీరో రాంచరణ్ తన కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ రోల్స్ లో ఒకటిగా చెప్పుకునే ఆ పాత్రకు జీవం పోసాడు . హీరోయిన్ గా సమంత తన యాక్టింగ్ స్కిల్స్ ని ఒక అల్టిమేట్ ప్యాకేజీ లా చేసి వావ్ అనిపించింది . ఇక ఆది పినిశెట్టి , జగపతిబాబు తదితరులు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఈ సినిమాకి దేవి సంగీతం మరో ప్లస్ గా నిలిచింది . ఒక్కో పాట ఒక్కో అద్భుతం లా రచించిన చంద్రబోస్ కి ,ట్యూన్స్ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్ కి థాంక్స్ చెప్పకుండా ఉండలేక పోయారు ఫాన్స్ . రిలీజ్ అయిన ప్రతి చోటా హిట్ టాక్ తెచ్చుకుని వండర్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా.
ఇక కెజిఫ్ సినిమాతో సినీ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడ స్టార్ యాష్ ని ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ ని చేసేసాడు . శాండల్ వుడ్ సినిమాలన్నీ ఒక ఎత్తు కెజిఫ్ ఒక్కటి ఒక ఎత్తులా నిర్మించాడు అయన. ఆ నెక్స్ట్ కెజిఫ్ 2 విడుదల చేసి మరో సారి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసేలా చేశారు యష్ అండ్ ప్రశాంత్ నీల్. ఎడిటింగ్ , హీరో ఎలేవేషన్స్ , న్యూ బ్యాక్ డ్రాప్ అన్ని కలిసి సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లేలా చేసింది మూవీ టీం. పాన్ ఇండియా స్థాయిలో దేనికదే స్పెషల్ అన్నట్టుగా బాక్స్ ఆఫీస్ దండ యాత్ర చేసిన రంగస్థలం, కెజిఫ్ చిత్రాలు ఇప్పుడు జపాన్ లో తమ సునామి కంటిన్యు చేస్తున్నాయి. కెజిఫ్ 1 చిత్రం వన్ మిలియన్ అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ సాధిస్తే.. కెజిఫ్ 2 మాత్రం 650కే యెన్స్ మాత్రమే సొంతం చేసుకుంది. కానీ రంగస్థలం మాత్రం రెండు మిలియన్ యెన్స్ గ్రాస్ కలెక్ట్ చేసి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది . జపాన్ మార్కెట్ ని రాంచరణ్ దుమ్ము దులిపేస్తున్న స్టైల్ కి అందరు షాక్ అవుతున్నారు.