Ranveer Singh: హనుమాన్‌కి పోటీగా.. 1000 కోట్ల శక్తిమాన్..
హనుమాన్ మూవీకి వచ్చిన స్పందన చూసిన తర్వాత ఈ ఫిల్మ్ టీంలో జోరు పెరిగిందో ఏమోకాని, మొత్తానికి శక్తిమాన్ మూవీని వెయ్యికోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. మూడు భాగాలుగా శక్తిమాన్‌ని తెరకెక్కించబోతున్నారట.
Ranveer Singh: శక్తిమాన్.. నైంటీస్ కిడ్స్ ఎన్నడూ మర్చిపోలేని పేరు. అంతగా అప్పట్లో శక్తిమాన్ పేరు మారుమోగింది. ఇప్పుడు వెయ్యికోట్ల మూవీగా ఈ సినిమా మారబోతోంది. నిజమే రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు శక్తిమాన్‌గా మారేపనిలోఉన్నాడు. అసలు శక్తిమాన్ ప్రాజెక్ట్‌ని సోనీ పిక్చర్స్ సంస్థ ఎప్పుడో ఎనౌన్స్ చేసింది. తర్వాత ఆ ప్రాజెక్ట్ పెండింగ్‌లో పడింది. ఐతే హనుమాన్ మూవీకి వచ్చిన స్పందన చూసిన తర్వాత ఈ ఫిల్మ్ టీంలో జోరు పెరిగిందో ఏమోకాని, మొత్తానికి శక్తిమాన్ మూవీని వెయ్యికోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి.
DEVARA: దసరాకు దేవర దండయాత్ర.. ఇక పూనకాలే
మూడు భాగాలుగా శక్తిమాన్‌ని తెరకెక్కించబోతున్నారట. రణ్‌వీర్ సింగ్ శక్తిమాన్‌గా మారేందుకు రెడీ అవుతున్నాడట. తన సూట్ కూడా హాలీవుడ్ టెక్నీషియన్స్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ బాలీవుడ్‌లో క్రిష్ 4 ప్లానింగ్‌లో ఉంది. హృతిక్ హీరోగా మూడుసార్లు హిట్ అయిన ఈ కాన్సెప్ట్ నాలుగో సారి సెట్స్ పైకెళ్ళనుంది. మలయాళ మున్నాల్ మురళి కూడా సీక్వెల్ రూపంలో రెడీ అవుతోంది. ఇక జై హనుమాన్ అంటూ హనుమాన్ టీం ఈసినిమాకు సీక్వెల్‌ని ప్లాన్ చేసింది. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. మొత్తానికి హనుమాన్ హిట్‌తో మూడు సూపర్ హీరో ప్రాజెక్టుల్లో కదలిక వచ్చేసింది.