RAM CHARAN: చిరు, చరణ్‌కి ఆసక్తి ఉన్న కాలం కలిసిరాలేదా..?
హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్‌లో హనుమంతుడిగా నటించమని అప్రోచ్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కానీ, గేమ్ ఛేంజర్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న చరణ్, ఆ తర్వాత బుచ్చి బాబు, సుకుమార్ సినిమాలకు కమిటయ్యాడు.
RAM CHARAN: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ కమ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ హనుమాన్ పాత్ర వేస్తే టాలీవుడ్ షేక్ అవుతుంది. పాన్ ఇండియాకి కూడా లార్డ్ రామ్‌గా కనిపించిన రామ్ చరణ్, ఇప్పుడు హనుమంతుడి పాత్ర వేస్తే డెఫినెట్‌గా ఓరేంజ్‌లో ఉంటుంది. అందుకే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్‌లో హనుమంతుడిగా నటించమని అప్రోచ్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
SSMB29: 9 నెలల్లో మహేశ్ బాబు సినిమాని పూర్తి చేయబోతున్నాడా..?
కానీ, గేమ్ ఛేంజర్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న చరణ్, ఆ తర్వాత బుచ్చి బాబు, సుకుమార్ సినిమాలకు కమిటయ్యాడు. చిరు విశ్వంభర, అలాగే అనిల్ రావిపుడి, హరీష్ శంకర్ సినిమాలకు సై అన్నాడు. కాబట్టే జై హనుమాన్‌లో హనుమంతుడి పాత్రకి చరణ్, చిరు కమిటవ్వలేకపోయారు. కంగువా పార్ట్ 2 షూటింగ్ వల్ల తమిళ స్టార్ సూర్య కూడా ఈ పాత్ర మీద ఆసక్తి ఉన్నా చేయలేకపోతున్నాడట. ఏదేమైనా ప్రశాంత్ వర్మ చిన్న దర్శకుడే అయినా, హనుమాన్‌తో పాన్ ఇండియాను షేక్ చేశాడు. అందుకే తనమీద నమ్మకంతో మైత్రీ మూవీ మేకర్స్ జై హనుమాన్ మూవీ బడ్జెట్ 30 కోట్లయితే, 270 కోట్లు పెట్టుబడి పెట్టి దాన్ని 300 కోట్ల బడ్జెట్‌గా మార్చేలా సపోర్ట్ ఇస్తున్నారు. అంతా బానే ఉంది.
కాని జై హనుమాన్‌లో హనుమంతుడెవరు, రాముడెవరు అనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఇక్కడే హనుమంతుడి పాత్రకు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రాముడిగా దుల్కర్ సల్మాన్ నటించే ఛాన్స్ ఉందంటున్నారు. 2025 జూన్‌లో జై హనుమాన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. 2026 సంక్రాంతి లేదా సమ్మర్‌లో ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది.