Bollywood: రణ్ వీర్ సింగ్ మీద 4 ఏళ్లు బ్యాన్ ? చేసిన పని అలాంటిది..?
రణ్ వీర్ సింగ్ ని మరో 4 ఏళ్లు సినిమాల్లోకి తీసుకోవద్దని హుకు జారీ చేసిందట యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షణ్ హౌజ్. నిజమే కనీసం 4 ఏళ్లు తనని బ్యాన్ చేసినట్టేనట. ఏది అఫీషియల్ కాదు. కాని ఎవరికి వెళ్లాల్సిన మెసేజ్ లు వాళ్లకి వెళ్లాయట.
6 ఫ్లాపులతో డీలా పడ్డ రణ్ వీర్ సింగ్ ని అసలు హీరోగా పరిచయం చేసిందే యష్ రాజ్ ప్రొడక్షన్ హౌజ్. అలాంటి ఆ బ్యానరే ఈ హీరోకి 4 ఏళ్ల శిక్షపడేలా బ్యాన్ చేస్తోందని ప్రచారం పెరిగింది. కారణం కేవలం వరుస ఫ్లాపులే కాదు, ప్రొడక్షన్ హైజ్ తో గతంలో తను కుదుర్చుకున్న ఒప్పందాన్ని నెగ్లెక్ట్ చేయటం కూడానట. రంగంలోకి దిగిన కరణ్ జోహార్ కూడా ఏం చేయలేకపోతున్నాడని తెలుస్తోంది
దీపికా మొగుడు రణ్ వీర్ సింగ్ మీద యష్ రాజ్ బ్యానర్ టీం ఫైర్ అవటంతో, సొట్టబుగ్గల సుందరి కూడా సీన్లోకి వచ్చి కూల్ చేయబోయింది. కాని మ్యాటర్ తేడా కొట్టిందట. యష్ రాజ్ బ్యానర్ బ్యాన్ చేస్తే ఇక రణ్ వీర్ కి బాలీవుడ్ లో ఆఫర్స్ ఉండవా అంటే, శంకర్ లాంటి డైరెక్టరే అపరిచితుడు రీమేక్ వద్దనుకున్నాడంటే, యష్ రాజ్ బ్యానర్ కి ఉన్న పలుకు బడి ఏపాటితో తెలుస్తోందనంటున్నారు. దీంతో రణ్ వీర్ సింగ్ మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంటూ ప్రచారంజరుగుతోంది.