Rashmi Gautam: మంచి ఛాన్స్ మిస్.. కుర్చీని మడతపెట్టి సాంగ్ రిజెక్ట్ చేసిన రష్మీ..
వెండితెరపై మెరిసే బ్యూటీ క్రేజీ ఆఫర్ వదిలేసుకుందన్న న్యూస్ చర్చనీయాంశంగా మారింది. గుంటూరు కారం సినిమా నుంచి ఆఫర్ వస్తే తిరస్కరించిందట. గుంటూరు కారం ఏంటీ.. ఆఫర్ ఏంటీ అనుకుంటున్నారా..?

Rashmi Gautam: బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ రష్మీ గౌతమ్. నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ షోతో ఈ బ్యూటీ కెరీర్ కు మంచి బ్రేక్ దొరికింది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ సూపర్ ఫాలోయింగ్ ఉంది. అయితే బ్యూటీ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అప్పుడప్పుడు వెండితెరపై మెరిసే బ్యూటీ క్రేజీ ఆఫర్ వదిలేసుకుందన్న న్యూస్ చర్చనీయాంశంగా మారింది.
Harish Shankar: మాస్ వార్నింగ్.. హరీష్ శంకర్ బోల్డ్ స్టేట్‌మెంట్
గుంటూరు కారం సినిమా నుంచి ఆఫర్ వస్తే తిరస్కరించిందట. గుంటూరు కారం ఏంటీ.. ఆఫర్ ఏంటీ అనుకుంటున్నారా.. గుంటూరు కారం సినిమాలోని కుర్చీని మడతపెట్టి సాంగ్ ఆఫర్ ముందుగా రష్మీనే వరించిందట. అందులో పూర్ణ చేసిన బిట్‌లో ముందుగా రష్మీని తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకున్నాడట. ఆయన టీమ్ వెళ్లి సంప్రదిస్తే.. మొత్తం పాటయితే చేస్తానని, రెండు.. మూడు బిట్‌లలో అయితే చేయలేనని చెప్పేసిందట. అలా రష్మీ ఆఫర్ పూర్ణకు వెళ్లింది. ఇక ఈ పాట వల్ల పూర్ణకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ట్రోలింగ్ సంగతి కాస్త పక్కన పెడితే.. కుర్చీ మడత పెట్టి సాంగ్ మాత్రం ఓ రేంజ్‌లో ఊపేసింది.
ఈ సాంగ్ వచ్చినప్పుడు ఈలలు గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. మహేష్, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులకు సీట్లలో ఒక్కరు కూడా కూర్చోలేకపోయారు. అలాంటి సాంగ్‌ను రష్మి మిస్ కోవడంతో.. అయ్యో పాపం అనేస్తున్నారు బ్యూటీ అభిమానులు.