Rashmika : జపాన్ లో రష్మిక..ఇండియా తరుపున మొదటి వ్యక్తి గా

స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. రేపు జపాన్ (Japan) రాజధాని టోక్యో లో జరిగే క్రంచైరోల్ అనిమే అవార్డ్స్ లో పాల్గొనబోతుంది. లైవ్ ప్రెజెంటర్ గా రష్మిక తన సత్తా చాటనుంది. దీంతో భారత్ తరపున ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న ఏకైక నటిగా ఆమె ఘనతని సాధించింది. ఇంతకీ క్రంచైరోల్ అనిమే అవార్డ్స్ అంటే ఏమిటో చూద్దాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 2, 2024 | 02:56 PMLast Updated on: Mar 02, 2024 | 2:56 PM

Rashmika As The First Person Representing India In Japan

స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. రేపు జపాన్ (Japan) రాజధాని టోక్యో లో జరిగే క్రంచైరోల్ అనిమే అవార్డ్స్ లో పాల్గొనబోతుంది. లైవ్ ప్రెజెంటర్ గా రష్మిక తన సత్తా చాటనుంది. దీంతో భారత్ తరపున ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న ఏకైక నటిగా ఆమె ఘనతని సాధించింది. ఇంతకీ క్రంచైరోల్ అనిమే అవార్డ్స్ అంటే ఏమిటో చూద్దాం.

సోనీ గ్రూప్ (Sony Group) కి చెందిన క్రంచైరోల్ జపాన్ కి చెందిన అనిమే తో కలిసి క్రంచైరోల్ అనిమే అవార్డ్స్ ఇస్తుంటారు. యానిమేషన్ ఫిలిమ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వాళ్ళకి ఆ అవార్డ్స్ ఇస్తుంటారు. ఇప్పడు ఆ వేడుకల్లో పాల్గొనేందుకు రష్మిక వెళ్లడం నిజంగా మనందరికి గర్వకారణం అని చెప్పవచ్చు. 2017 నుంచి ఆ అవార్డు ఇస్తున్నారు. ప్రపంచ దేశాలకి చెందిన సినీ ప్రేమికులు ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఇక టోక్యో ఎయిర్ పోర్ట్ లో అయితే రష్మిక కి ఘన స్వాగతం లభించింది. చాలా మంది లేడీ అభిమానులు రష్మిక ఫొటోస్ తో డిజైన్ చేసిన ప్లే కార్డులు చూపిస్తు వెల్కమ్ చెప్పారు. తనకి లభించిన ఆదరణని చూసి రష్మిక ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ అండ్ వీడియోస్ వైరల్ గా మారాయి. లేటెస్ట్ గా యానిమల్ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న రష్మిక ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2), ది గర్ల్ ఫ్రెండ్ (The Girlfriend) మూవీలో నటిస్తుంది.