Vijay Devarakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక.. అదిరిన దీపావళి వేడుకలు
రష్మిక, రౌడీ హీరో గత కొన్ని రోజులు సీక్రెట్ గా లవ్ మ్యాటర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నెటిజన్లకు దొరకకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ ఫోటోలను వ్యక్తిగతంగా షేర్ చేసుకుంటున్నారు.

Rashmika at rowdy boy Vijay Devarakonda's house. Diwali celebrations
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) , రష్మిక మందన్న (Rashmika) మధ్య లవ్ ఎఫైర్ ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ లివిన్ రిలేషన్‌లో ఉంటున్నారనే ప్రచారం తెగ జరుగుతోంది. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు కలిసి దీపావళి పండగ (Diwali celebrations) చేసుకోవడం సెన్సేషన్ గా మారింది.
Baby Heroine Vaishnavi Chaitanya : ఫాఫం బేబీ..
రష్మిక, రౌడీ హీరో గత కొన్ని రోజులు సీక్రెట్ గా లవ్ మ్యాటర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నెటిజన్లకు దొరకకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ ఫోటోలను వ్యక్తిగతంగా షేర్ చేసుకుంటున్నారు. కానీ రష్మిక దీపావళి ఫోటోలను బట్టి తెలిసింది. ఆ ఫోటోలు విజయ్ దేవరకొండ ఇంట్లో తీసినట్టు అర్థం అవుతోంది. విజయ్, రష్మిక ఇద్దరూ షేర్ చేసిన ఫోటోల్లో కామన్‌గా కనిపించిన గోడ సహాయంతో ఇద్దరూ ఒకేచోట దీపావళి జరుపుకున్నారని పసిగట్టేశారు నెటిజన్లు.
గత ఏడాది ప్రారంభంలో విజయ్, రష్మిక మాల్దీవులకు సెలవు కోసం వెళుతున్న సమయంలో ఎయిర్ పోర్టులో కనిపించారు. దీంతో వారి రిలేషన్ షిప్ గురించి తెలిసింది. విజయ్, రష్మిక మందన్న తాము డేటింగ్ చేస్తున్నామని ఎప్పుడూ చెప్పలేదు. మంచి స్నేహితులం అని మాత్రమే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్మిక ప్రస్తుతం పుష్ప2, యానిమల్ మూవీల్లో నటిస్తుండగా, విజయ్ దేవర కొండ ఫ్యామిలీ మాన్ లో నటిస్తున్నాడు.