కొత్త వ్యాధి బారిన పడ్డ రష్మిక… అప్పుడు సమంతా ఇప్పుడు రష్మిక

సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది రష్మిక మందన. బాలీవుడ్, టాలీవుడ్ అలాగే శాండిల్ వుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అటు తమిళంలో కూడా అప్పుడప్పుడు పలకరిస్తూ వస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2024 | 08:18 PMLast Updated on: Dec 27, 2024 | 8:18 PM

Rashmika Infected With A New Disease Then Samantha Now Rashmika

సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది రష్మిక మందన. బాలీవుడ్, టాలీవుడ్ అలాగే శాండిల్ వుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అటు తమిళంలో కూడా అప్పుడప్పుడు పలకరిస్తూ వస్తోంది. మన తెలుగులో అయితే ఈమెకు స్టార్ హీరోలతో సమానంగా ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా వచ్చిన పుష్ప పార్ట్ 2 సినిమాలో రష్మిక వందన యాక్టింగ్ కు చాలా మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ అనే సినిమాలో నటిస్తోంది.

వచ్చేయడాది రంజాన్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రష్మిక మందన… విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకుంటుంది అంటూ ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా ముంబై ఎయిర్పోర్ట్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రష్మిక ఎక్కడికో వెళ్తుంది అనే ఒక గ్రాఫిక్ షేక్ చేసింది. ఇక రష్మిక మందనాకు ఒక చర్మవ్యాధి ఉందంటూ లేటెస్ట్ గా ఒక న్యూస్ బయటకు వచ్చింది. సినిమా హీరోయిన్లకు ఎక్కువగా వచ్చే ఈ చర్మ వ్యాధి రష్మిక మందన కూడా వచ్చిందట.

పుష్ప 2 షూటింగ్ సమయంలో ఆమె వేసుకున్న మేకప్ కారణంగా రష్మిక ఇబ్బంది పడుతుందట. వాస్తవానికి మేకప్ వేసుకునే కాస్మెటిక్స్ లో అనేక రసాయనాలు కలుపుతారు. ఇప్పుడు రష్మికకు మేకప్ వేసుకుంటే చర్మంపై తరచుగా మంట రావడంతో పాటుగా దద్దుర్లు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే స్కిన్ ఎర్రగా అవుతుంది. ఈ సమస్య రష్మిక మందనకు తీవ్రంగా ఉండటంతో రీసెంట్ గా ఒక డెర్మటాలజిస్ట్ ను కలిసిందట. ఆమెకు చర్మ వ్యాధి వచ్చినట్టు డెర్మటాలజిస్ట్ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయింది.

షూటింగ్ టైంలో కెమెరాల లైటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ వేడికి మేకప్ కరిగిపోతూ ఉంటుంది. దీనితో రసాయనాలు కలిపిన కాస్మెటిక్స్ వాడటంతో ప్రెగ్నెంటేషన్ పెరుగుతోంది. అక్కడి నుంచి జుట్టు రాలడం అలాగే చర్మం పొలుసుల్లా మారడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనిని సోరియాసిస్ అని కూడా అంటారు. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకూడదని వైద్యులు వార్నింగ్ ఇస్తున్నారు. దీనిపై రష్మిక కానీ ఆమె టీం గాని రెస్పాండ్ కాలేదు. గతంలో ఇదే సమస్య స్టార్ హీరోయిన్ సమంతకు కూడా వచ్చింది. అల్లుడు శీను సినిమా సమయంలో ఆమె ఈ వ్యాధితో బాధపడింది. ఆ సమయంలో దాదాపు నాలుగు నెలల పాటు ఆమె ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. ఈ విషయాన్ని ఇటీవల ఆ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. అయితే ప్రస్తుతం రష్మికకు ఆ వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉంది ఏంటి అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం రష్మిక మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వ్యాధి తీవ్రత పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.