Rashmika: మేనేజర్ చేతిలో మోసపోయిన రష్మిక..
సదరన్ సినిమాలో తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న రష్మిక.. బాలీవుడ్‌లో పాగా వేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లో యాక్ట్ చేసింది. ఐతే ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

Rashmika Mandana Fraud With her manager
దీంతో ఆమె ఆశలన్నీ రెండు సినిమాలపైనే ఉంది. అందులో మొదటిది యానిమల్. రణ్‌భీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా అది. ఆగస్ట్ 11న రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరో సినిమా పుష్ప 2. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎంటైర్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చి పెడుతుందని రష్మిక ఆతృతగా ఎదురు చూస్తోంది. ఇలాంటి టెన్షన్‌లో ఉన్న రష్మికకు అనుకోని షాక్ తగిలింది. అది కూడా ఆమె మేనేజర్ రూపంలో! రష్మిక కెరీర్ స్టార్టింగ్ నుంచి నిన్న మొన్నటి వరకు మేనేజర్‌గా వ్యవహరించిన వ్యక్తి.. ఏకంగా ఆమె దగ్గర నుంచి 80 లక్షల రూపాయల వరకు మోసం చేసినట్లు తెలుస్తోంది.
ఐతే ఈ విషయంపై సీన్ చేయటం రష్మికకు ఇష్టం లేదు. అందుకనే ఎలాంటి కంప్లైంట్ లాంటివి ఇవ్వలేదని, అసలు బయటకు కూడా తెలియనివ్వలేదనేది ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. ఇండస్ట్రీలో ఏ విషయం ఆగదు కదా.. ఇప్పుడు కూడా లీక్ అయింది. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో కెరీర్ స్టార్ట్ చేసిన రష్మిక.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మహేష్, అల్లు అర్జున్, నితిన్ వంటి స్టార్స్‌తో నటిస్తూనే ఇతర సినీ రంగాలపై కన్నేసింది. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అయితే యానిమల్, పుష్ప 2 సినిమాలో ఆమె ఎలా ఉండబోతుందని అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. పుష్ప 2 ది రూల్ మూవీ విషయానికి వచ్చే సరికి ఆమె శ్రీవల్లి అనే పాత్రలో నటిస్తుంది. పుష్ప ది రైజ్‌లో తనదైన ట్రేడ్ మార్క్ స్టెప్పులతో అలరించిన ఈ శాండిల్ వుడ్ బ్యూటీ పుష్ప 2లో ఎలా మెప్పించనుందో చూడాలి మరి.