Vijaya Devarakonda: శ్రీవల్లికి రౌడీ షాక్.. విజయ్ దేవరకొండ పెళ్లి.. గెస్ట్‌గా రష్మిక

`గీత గోవిందం సినిమా టైమ్ నుంచి విజయ్-రష్మిక డేటింగ్‌లో ఉన్నారనే గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. నిజం అని చెప్పరు-అబద్ధం అని కొట్టిపడేయరు. కానీ ఇద్దరూ కలసి విహారయాత్రల్లో మునిగితేలుతుంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2023 | 03:32 PMLast Updated on: Dec 02, 2023 | 3:32 PM

Rashmika Mandanna As Chief Guest For Vijaya Devarakonda Marriage

Vijaya Devarakonda‎: కొన్నేళ్లుగా రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అనే హడావుడి జరుగుతోంది. అది నిజమే అని నేరుగా చెప్పకపోయినా ఎప్పటికప్పుడు హింట్స్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నారిద్దరూ. రేపో మాపో పెళ్లి కబురు చెబుతారనుకున్న టైమ్‌లో విజయ్ దేవరకొండ పెళ్లికి గెస్ట్‌గా రష్మిక అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేంటిదంతా.. అనుకుంటున్నారా..? `గీత గోవిందం సినిమా టైమ్ నుంచి విజయ్-రష్మిక డేటింగ్‌లో ఉన్నారనే గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. నిజం అని చెప్పరు-అబద్ధం అని కొట్టిపడేయరు.

PAWAN KALYAN: పవన్ బిజీ.. ఏపీలో ఎన్నికల తర్వాత పవన్ చేయబోయే మూవీ ఇదే!

కానీ ఇద్దరూ కలసి విహారయాత్రల్లో మునిగితేలుతుంటారు. రీసెంట్‌గా విజయ్.. రౌడీ బ్రాండ్ దుస్తులు వేసుకుని తనవంతు ప్రమోషన్ స్టార్ట్ చేసింది రష్మిక. సేమ్ డే విజయ్ కూడా హైదరాబాద్‌లో సేమ్ టీషర్ట్ వేసుకుని కనిపించాడు. అంతకుముందు దీపావళి వేడుకలు కూడా రష్మిక, విజయ్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందనే టాక్ వచ్చింది. అంతెందుకు విజయ్ సోదరుడు ఆనంద్ నటించిన బేబీ మూవీ ప్రమోషన్లో రష్మిక సెంటరాఫ్ అట్రాక్షన్ అయింది. వదిన వదిన అని ఫ్యాన్స్ అరుస్తుంటే తెగ మురిసిపోయింది. ఇద్దరూ ఎవరి ప్రాజెక్టులలో వాళ్లు బిజీగా ఉన్నారు. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తారని ఫ్యాన్స్ వెయిటింగ్. ఇలాంటి టైమ్‌లో విజయ్ దేవరకొండ పెళ్లికి రష్మిక గెస్ట్ అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్యకాలంలో సరైన హిట్ అందుకోలేకపోయిన విజయ్ దేవరకొండ ఈ సారి కచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే తన 13వ సినిమా ఫ్యామిలీ స్టార్‌పై ఫుల్ కాన్సన్‌ట్రేట్ చేశాడు. ఈ మూవీకి పరశురాం దర్శకుడు.

‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన లుక్, టీజర్‌కి మంచి రివ్యూలొచ్చాయి. వాస్తవానికి ఈ మూవీ సంక్రాంతికి విడుదలకావాల్సింది. కానీ సమ్మర్‌కి వాయిదా వేశారు. ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక కూడా నటించబోతోందంటూ వార్తలొచ్చాయి. ఇందులో రష్మిక క్యారెక్టర్ గురించి చాలా వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఈ మూవీలో రష్మిక ఓ పాటలో మాత్రమే కనిపిస్తుందట. అది కూడా విజయ్ దేవరకొండ – మృణాల్ ఠాకూర్ మ్యారేజ్ సాంగ్ అని.. ఆ పెళ్లికి గెస్టుగా రష్మిక వస్తుందని తెలుస్తోంది. ఈ సాంగ్ థియేటర్లో మారుమోగిపోతుందని విజయ్-రష్మిక ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసేలా ఉంటుందని టాక్. ఇదంతా సినిమా కోసమే అని తెలిసి రౌడీ ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు. ఇంతకీ విజయ్-రష్మిక గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో మరి!