Rashmika Mandanna: రష్మిక సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..?

ఓ ఈవెంట్‌కు హాజరైన రష్మిక తనకు డిసెంబర్‌ నెల ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు నటించిన కొన్ని సినిమాలు డిసెంబర్‌లో రిలీజై సూపర్‌హిట్‌ కావడంతో.. ఈ నెలను అదృష్టంగా, సెంటిమెంట్‌గా భావిస్తోంది రష్మిక. రష్మిక డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ డిసెంబర్‌లోనే విడుదలై సూపర్‌ హిట్‌ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 16, 2023 | 04:45 PMLast Updated on: Aug 16, 2023 | 4:45 PM

Rashmika Mandanna Believes In December Sentimnet For Her Upcoming Films

Rashmika Mandanna: రష్మిక ఎంత బాగా కష్టపడుతుందో.. అంతకంటే ఎక్కువగా సెంటిమెంట్స్‌ను నమ్ముతుంది. ఇదే సెంటిమెంట్‌లో తన సినిమా గ్యారెంటీ హిట్‌ అని నమ్ముతోంది. ఇంతకీ రష్మిక ఏ సినిమా గురించి.. ఏ సెంటిమెంట్‌ గురించి మాట్లాడిందో చూద్దాం. ఓ ఈవెంట్‌కు హాజరైన రష్మిక తనకు డిసెంబర్‌ నెల ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు నటించిన కొన్ని సినిమాలు డిసెంబర్‌లో రిలీజై సూపర్‌హిట్‌ కావడంతో.. ఈ నెలను అదృష్టంగా, సెంటిమెంట్‌గా భావిస్తోంది రష్మిక.

రష్మిక డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ డిసెంబర్‌లోనే విడుదలై సూపర్‌ హిట్‌ అయింది. పాన్‌ ఇండియా ఇమేజ్‌ తీసుకొచ్చిన పుష్ప కూడా డిసెంబర్‌లో విడుదలైంది. అలాగే పునీత్‌తో జత కట్టిన అంజనీపుత్ర ఇదే నెలలో రిలీజై ఘన విజయం సాధించింది. దీంతో డిసెంబర్‌లో తన సినిమా రిలీజ్‌ అంటే గ్యారెంటీ హిట్‌ అన్న సెంటిమెంట్‌లో పడిపోయిన రష్మిక నెక్ట్ మూవీ సక్సెస్‌పై ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో వుంది. రష్మిక రణ్‌బీర్‌ కపూర్‌తో జత కట్టిన హిందీ మూవీ ‘యామిమల్’ డిసెంబర్‌1న రిలీజ్ అవుతోంది. అర్జున్‌రెడ్డి ఫేం సందీప్‌ వంగా దర్శకుడు. సినిమాలో ఇప్పటివరకు చేయని కష్టమైన పాత్ర పోషించానని, ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలంటోంది రష్మిక. మరి ఈ కన్నడ బ్యూటీ సెంటిమెంట్‌ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి మరి.