VIJAY DEVARAKONDA: మ‌రోసారి విజ‌య్-ర‌ష్మిక.. స్పెష‌ల్ సాంగ్‌తో ర‌చ్చ.. అభిమానుల‌కు పండ‌గే

విజయ్ ప్రస్తుతం చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆ సినిమాలో రష్మిక ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. అయితే.. గౌతం తిన్ననూరితో విజ‌య్ చేస్తున్న మూవీలో ర‌ష్మిక‌తో స్పెష‌ల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నార‌ని లేటెస్ట్ అప్‌డేట్ వినిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 16, 2024 | 03:06 PMLast Updated on: Jan 16, 2024 | 3:06 PM

Rashmika Mandanna Doing Special Song In Vijay Devarakondas Nexe Movie

VIJAY DEVARAKONDA: ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వినిపిస్తున్న‌పేర్లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక‌. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారు అంటూ కొంతకాలంగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ నటించిన రెండు సినిమాలలో కూడా కెమిస్ట్రీ అద్భుతంగా పండించారు. దీంతో వీరు నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారని అందరూ భావిస్తున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఒకే చోటకు వెళ్లడం, ఒకే దగ్గర పండగలను సెలెబ్రేట్ చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

GUNTUR KAARAM: గురూజీ ఎక్కడ..? త్రివిక్రమ్ లేకుండా గుంటూరు కారం సెలబ్రేషన్స్‌

అయితే.. సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ల‌పై రూమ‌ర్స్ కామ‌నే అయిన‌ప్ప‌టికీ.. వీరిద్ద‌రి వ్య‌వ‌హార శైలి కూడా ఈ రూమ‌ర్ల‌కు బ‌లం చేకూరుస్తోంది. త‌మ‌పై వ‌స్తున్న ఈ రూమ‌ర్స్‌పై ఇద్ద‌రూ స్పందించన‌ప్ప‌టికీ.. ఏదో ఒక సందర్భంలో ఇద్దరు దొరికిపోతున్నారు. ఇలా సీక్రెట్‌గా రిలేషన్ మెయింటైన్ చేస్తున్న రష్మిక, విజయ్ దేవరకొండ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ తాజాగా ఒక వార్త కూడా వైర‌ల్ అయింది. వీళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని అభిమానులు కూడా బ‌లంగా కోరుకుంటున్నారనుకోండి. అయితే.. ఈ వార్త‌ల్లో నిజం ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. వీళ్లిద్ద‌రినీ మ‌ళ్లీ స్క్రీన్ మీద చూడాల‌నుకుంటున్న ఫ్యాన్స్‌కు మాత్రం అదిరిపోయే అప్‌డేట్ ఒక‌టి వ‌చ్చింది. విజయ్ ప్రస్తుతం చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆ సినిమాలో రష్మిక ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి.

అయితే.. ఈ మూవీలో ర‌ష్మిక స్పెష‌ల్ సాంగ్ లేదని.. గౌతం తిన్ననూరితో విజ‌య్ చేస్తున్న మూవీలో ర‌ష్మిక‌తో స్పెష‌ల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నార‌ని లేటెస్ట్ అప్‌డేట్ వినిపిస్తోంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య నటిస్తోంది. సినిమాలో అదనపు ఆకర్షణ కోసం రష్మిక మందన్నతో స్పెషల్ సాంగ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట మేక‌ర్స్‌. ఈ న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. విజ‌య్‌, ర‌ష్మికను జంట‌గా చూడాల‌నుకుంటున్న ఫ్యాన్స్‌కు ఈ వార్త ఫుల్ జోష్‌ అందిస్తోంది. మూవీ మొత్తంగా కాక‌పోయినా.. త‌మ అభిమాన హీరో, హీరోయిన్ల‌ను స్పెష‌ల్ సాంగ్‌లో అయినా చూడొచ్చని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. రష్మిక ఈ సినిమాకు భారీ హైప్ తీసుకురావడంలో సక్సెస్ అవుతుందని మూవీ యూనిట్ కూడా బ‌లంగా న‌మ్ముతోంద‌ట‌.