Rashmika : ప్రేమలో పడ్డ అంటున్న రష్మిక మందన్న

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న. పాన్ ఇండియా మూవీస్ లో సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. అంతేకాక నేషనల్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. పుష్ప సినిమాతో రష్మికకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. నేషనల్ క్రష్‌ కాస్తా.. క్రష్మిక అయిపోతోంది. హీరోలు సైతం రష్మికను క్రష్మిక అని పిలుస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న పాన్‌ ఇండియా మూవీ “పుష్ప”2లో హీరోయిన్ గా నటిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 6, 2024 | 12:22 PMLast Updated on: Jan 06, 2024 | 12:22 PM

Rashmika Mandanna Is Said To Have Fallen In Love

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న. పాన్ ఇండియా మూవీస్ లో సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. అంతేకాక నేషనల్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. పుష్ప సినిమాతో రష్మికకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. నేషనల్ క్రష్‌ కాస్తా.. క్రష్మిక అయిపోతోంది. హీరోలు సైతం రష్మికను క్రష్మిక అని పిలుస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న పాన్‌ ఇండియా మూవీ “పుష్ప”2లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా బ్యూటీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

రష్మిక మందన సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పడు తన వ్యక్తిగత విషయాలతో పాటు ఫన్నీ ఫన్నీ వీడియోలు, హాట్‌ ఫోటోలతో నెటిజన్లుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా రష్మిక మందన్నా మరోసారి ప్రేమలో మునిగి తేలుతోంద ని తాజాగా ట్వీట్ చేస్తూ అర్థమవుతోంది.

రీసెంట్ గా యానిమల్ ప్రమోషన్స్ లో సారీ లుక్ లో మెస్మరైజ్ చేసిన రష్మిక మరోసారి సారీ లో బ్యూటిఫుల్ గా కనిపించింది. ఎల్లో కలర్ సారీ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో దేవతలా కనిపించింది. నా హృదయంలో మీ ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది అని తెలుసుకోండి, నేను చూసిన ప్రతిసారీ కరిగిపోతానని తెలుసుకోండి, నీతో ఒక సాధారణ క్షణం విడదీయరాని బంధాన్ని ఏర్పరచింది నా ప్రేమ..నాకు ఆనందం, మీ ప్రేమ – నా ప్రేమ.. అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో రష్మిక పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అంతేకాక బ్యూటీ ప్రేమలో పడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.