Rashmika Mandanna: శ్రీవల్లి రియాక్షన్.. డీప్ ఫేక్ వీడియోపై రష్మిక ఎమోషనల్ పోస్ట్..
టెక్నాలజీని తప్పుగా ఉపయోగించడం వల్ల తనతో పాటు ఎంతోమంది భయపడుతున్నారని.. ఈ ఘటన కాలేజీ లేదా స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ఊహించలేనని తన ఆవేదనను వ్యక్తం చేసింది.

Rashmika Mandanna: సోషల్ మీడియాలో వైరల్ (VIRAL)గా మారిన తన మార్ఫింగ్ వీడియోపై హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) రియాక్ట్ అయ్యారు. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోన్న తన డీప్‌ఫేక్ వీడియో (Deep fake video) గురించి మాట్లాడటానికి ఎంతో బాధపడుతున్నానని తెలిపారు. టెక్నాలజీని తప్పుగా ఉపయోగించడం వల్ల తనతో పాటు ఎంతోమంది భయపడుతున్నారని.. ఈ ఘటన కాలేజీ లేదా స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ఊహించలేనని తన ఆవేదనను వ్యక్తం చేసింది.
Salaar: ట్రైలర్ రెడీ.. కేరళ రైట్స్ దక్కించుకున్న సలార్ విలన్..
ఒక మహిళగా, అందులోనూ నటిగా తనను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు చెప్పారు. ఇలాంటి ఘటనలపై కలసికట్టుగా తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. రష్మికకు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు పలువురు నెటిజన్లు, సెలబ్రెటీలు తమదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని రష్మిక లిఫ్ట్‌లోకి వచ్చినట్లు ఆ వీడియోలో ఉంది. దీంతో ఈ వీడియో వైరల్ కాగా.. ఇది ఫేక్ వీడియో అని తేలింది. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియోలో జారా ఫేస్ బదులు రష్మిక ఫేస్ పెట్టి మార్ఫింగ్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా తీవ్రంగా స్పందిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Siri Hanumanthu: జబర్దస్త్ కొత్త యాంకర్‌గా సిరి హన్మంతు.. సౌమ్యను ఎందుకు తప్పించారు..?
అలాగే రష్మిక స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా.. మనమంతా ఒక కమ్యూనిటీగా మారి వీటికి పరిష్కారం చూపాలి అని రాసుకొస్తూ సైబర్ క్రైమ్‌ను ట్యాగ్ చేశారు. దీంతో రష్మిక పోస్ట్ ఇప్పుడు వీడియో వైరల్ గా మారింది. ఇక రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ సహా బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌బీర్ కపూర్‌తో కలిసి రష్మిక నటించిన ‘యానిమల్’ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అదే విధంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పాన్ ఇండిమా చిత్రం ‘పుష్ప-2’ లో కూడా నటిస్తోంది. ఇవే కాక మరో రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా మారింది.