Rashmika Mandanna: నమస్తే ఎట్లున్నరు.. తెలంగాణ యాసలో అదరగొట్టిన రష్మిక..
కొంత కాలం నుంచి ప్రతీ సినిమాలో తెలంగాణ యాస ఖచ్చితంగా కనిపిస్తోంది. విలన్స్, కమెడియన్స్ మాత్రమే కాదు.. హీరోలే తెలంగాణ యాస మాట్లాడి అదరగొడుతున్నారు. నార్మల్‌గా చెప్పే పంచ్ డైలాగ్స్ కంటే తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి
Rashmika Mandanna: ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ స్లాంగ్‌కు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు సినిమాల్లో ఈ స్లాంగ్ ఎక్కువగా కనిపించేది కాదు. ప్రత్యేకించి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమాల్లో తప్ప తెలంగాణ యాస ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు. కానీ కొంత కాలం నుంచి ప్రతీ సినిమాలో తెలంగాణ యాస ఖచ్చితంగా కనిపిస్తోంది. విలన్స్, కమెడియన్స్ మాత్రమే కాదు.. హీరోలే తెలంగాణ యాస మాట్లాడి అదరగొడుతున్నారు.
నార్మల్‌గా చెప్పే పంచ్ డైలాగ్స్ కంటే తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇప్పుడు ఆ యాసకు ఉన్న క్రేజ్ అది. రీసెంట్‌గా హీరోయిన్ రష్మిక మందన కూడా తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడి అదరగొట్టింది. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది రష్మిక. ఈ చాట్‌లో కొందరు ఫ్యాన్స్ రష్మికను తెలంగాణ యాసలో మాట్లాడాలంటూ కోరారు. తెలంగాణలో మీకు ఫ్రెండ్ ఉంటే ఎలా మాట్లాడతారు ఒకసారి మాట్లాడండి అంటూ అడిగారు. ఫ్యాన్స్ అడిగి వెంటనే నమస్తే ఎట్లున్నరు అంటూ తెలంగాణ యాసలో మాట్లాడింది రష్మిక. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. అద్భుతంగా మాట్లాడావంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.