Rashmika Mandanna: రౌడీ వద్దన్నా పూజా దారిలోనే.. తప్పు చేస్తున్న రష్మిక మందన్న..

హిందీ మూవీ యానిమల్ సాంగ్స్ షూటింగ్‌కి 2 నెలల టైం కేటాయించాల్సి రావటంతో భీష్మ టీం తో తను కంటిన్యూ కాలేకపోతోందట. ఆతర్వాత ఏమైనా ఛాన్స్ ఉందా అంటే, ప్రభాస్‌తో స్పిరిట్ చేయబోతోంది. సందీప్ రెడ్డి వంగ రష్మికను స్పెషల్ లుక్ లో చూపించేందుకు మేకోవర్ ప్లాన్ చేశాడట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 13, 2023 | 05:42 PMLast Updated on: Jul 13, 2023 | 5:42 PM

Rashmika Mandanna Walks Out Of Nithiins Film Here Is The Truth

Rashmika Mandanna: రౌడీ క్వీన్ రష్మిక తప్పు చేస్తోందా? నితిన్, వెంకీ కుడుములతో భీష్మ తర్వాత కాంబినేషన్ రిపీట్ చేస్తున్న తను సైడ్ అయిపోతోందా..? ఈ డౌట్లు రాగానే అవన్నీ పుకార్లే అనే సెన్స్ వచ్చేలా నవ్వుతూ ఫోటోని పోస్ట్ చేసింది. కానీ సీన్ చూస్తే నిజంగానే రష్మిక పక్కకు తప్పుకునే పరిస్థితి వచ్చినట్టుంది. భీష్మ తర్వాత నితిన్‌తో జోడీ కట్టిన రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోలేదు.

కాని తప్పుకుంది.. తప్పుకోలేదు.. ఇదంతా ఓపజిల్‌లా ఉందికదా? ఇక్కడ జరిగింది కూడా అదే.. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర చిన్నగా ఉండటంతో, ఇంకాస్త చిన్నగా చేసి గెస్ట్ రోల్‌కే పరిమితమవుతా అందట రష్మిక. దానికో బలమైన కారణముంది. హిందీ మూవీ యానిమల్ సాంగ్స్ షూటింగ్‌కి 2 నెలల టైం కేటాయించాల్సి రావటంతో భీష్మ టీం తో తను కంటిన్యూ కాలేకపోతోందట. ఆతర్వాత ఏమైనా ఛాన్స్ ఉందా అంటే, ప్రభాస్‌తో స్పిరిట్ చేయబోతోంది. సందీప్ రెడ్డి వంగ రష్మికను స్పెషల్ లుక్ లో చూపించేందుకు మేకోవర్ ప్లాన్ చేశాడట. సో ఆ లుక్ లీక్ కాకూడదంటే, రష్మిక స్పిరిట్ పూర్తయ్యే వరకు మరే మూవీ చేయకూడదు. ఈ కారణాల వల్ల రష్మిక నితిన్ మూవీలో ఫీమేల్ లీడ్ చేయాల్సింది పోయి గెస్ట్ రోల్‌కే పరిమితమవుతోందట.

ఏదో పెద్ద ఆఫర్ వచ్చిందని ఉన్నది వదులుకుంటే, అసలుది కూడా ఆవిరౌతుందంటారు. పూజా కూడా హిందీ సినిమా పిచ్చితో ఉస్తాద్ భగత్ సింగ్‌ని వదులుకుంది. గుంటూరు కారం మూవీ నుంచి బయటికొచ్చింది. ఇక హిందీలో రెండు సినిమాల్లో ఛాన్స్ చిక్కినా 6 నెలల వరకు వాటి షూటింగ్ జరగదట. కాబట్టి అంతకాలం చేతిలో సినిమాలు లేక తికమకపడాల్సిందే. అందుకే సాయితేజ్ సినిమా ఒప్పుకోవాల్సి వచ్చింది. అదే రష్మిక విషయంలో కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.