Rashmika Mandanna: అయ్యో పాపం రష్మిక.. ఆ సినిమా ఆగిపోయిందా..?
రీసెంట్‌గా నితిన్‌తో వెంకీ కుడుముల భీష్మ కాంబినేషన్‌ని రిపీట్ చేస్తే.. ముందు ఈ సినిమాలో అడుగు పెట్టిన రష్మిక, తర్వాత ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చింది. డైరెక్టర్‌తో పడలేదని, హీరోతో పొసగలేదని ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి.

Rashmika Mandanna: రష్మిక మందన్న మంచి నటే. గ్లామర్‌తోపాటు డాన్స్ కూడా పర్లేదు. ఛలో, భీష్మ, సరిలేరు నీకెవ్వరు, పుష్ప లాంటి హిట్లతో తన కెరీర్ బానే ఉంది. కానీ, ఈమధ్యే తను చేసిన తప్పుతో ఇండస్ట్రీలో రష్మికకు చెడ్డపేరొచ్చేలా ఉందట. రీసెంట్‌గా నితిన్‌తో వెంకీ కుడుముల భీష్మ కాంబినేషన్‌ని రిపీట్ చేస్తే.. ముందు ఈ సినిమాలో అడుగు పెట్టిన రష్మిక, తర్వాత ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చింది. డైరెక్టర్‌తో పడలేదని, హీరోతో పొసగలేదని ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి.
కాని, అసలు కారణం ఇప్పుడే బయట పడింది. హిందీ హీరో షాహిద్ కపూర్ మూవీ నుంచి ఆఫర్ వచ్చిందట రష్మకకి. ఎలాగూ రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ మూవీ చేస్తోంది. తర్వాత షాహిద్‌తో మరో హీందీ మూవీ చేస్తే, అక్కడ జెండా ఎగరేయొచ్చు అనుకుంది. అందుకే నితిన్ మూవీని పక్కన పెట్టేసిందట. ఏవో డేట్లు క్లాష్ అయ్యాయి, డేట్లు అడ్జెస్టు కావట్లదేని నితిన్ సినిమానుంచి బయటికొచ్చినట్టు కవరింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాని, డేట్లు క్లాష్ అవుతున్నాయో లేదో తెలియకుండానే ముందు మాటిచ్చిందా..? ఈ ప్రశ్నకే ఆన్సర్ లేదు.
సరే ఎందుకు నితిన్ సినిమాను వదులుుకుందో పక్కన పెడితే, ఇప్పుడు తన అత్యాశ వల్ల రష్మికకు పంచ్ పడినట్టుంది. షాహిత్ కపూర్‌తో రష్మిక చేయాల్సిన సినిమా రకరకాల కారణాలతో అటకెక్కిందట. సో.. ఇప్పుడు ఈ సినిమా పోయినట్టే, నితిన్ మూవీ కూడా పోయినట్టే. విచిత్రం ఏంటంటే రణ్‌బీర్ కపూర్‌తో చేస్తున్న యానిమల్ షూటింగ్ పూర్తవటంతో రష్మిక ఇప్పుడు ఖాళీయే.